Manchu Vishnu:మంచు ఫ్యామిలీ (Manchu Family).. ఇండస్ట్రీలో ఉన్న బడా ఫ్యామిలీలో ఈ ఫ్యామిలీ కూడా ఒకటి. అయితే రీసెంట్ గా మంచు ఫ్యామిలీ ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. దానికి కారణం మంచు మనోజ్ (Manchu Manoj), మోహన్ బాబు(Mohan Babu), మంచు విష్ణు (Manchu Vishnu) కి మధ్య ఉన్న గొడవలే.. అయితే వీరి ముగ్గురి మధ్య ఆస్తి గొడవలే ప్రధానంగా ఉన్నా.. అలాంటిదేమీ లేదు అందరిలాగే మా ఇంట్లో కూడా చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. దీన్ని మీడియా పెద్దగా చేసి చూపిస్తుంది అని వాళ్ళు కొట్టి పారేస్తున్నారు. కానీ మనోజ్ మాత్రం మోహన్ బాబు విద్యా సంస్థల్లో అవకతవకలు జరుగుతున్నాయని ,ఎన్నో విషయాలు మీడియా ముందు బయట పెట్టడానికి ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే వీరి మధ్య చిన్న గొడవ కూడా జరిగింది. అలాగే మనోజ్.. కుటుంబం నుండి తనకు ప్రాణహాని ఉందని, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. మోహన్ బాబు ఫ్యామిలీలో జరిగిన ఈ గొడవల్లో మోహన్ బాబు, విష్ణు ఒకవైపు ఉంటే.. మంచు మనోజ్ మాత్రం ఒక వైపు ఉన్నారు. ఇందులో మంచు లక్ష్మి(Manchu Lakshmi) కలుగజేసుకోలేదు. ఈ విషయం పక్కన పెడితే, మంచు మోహన్ బాబు చూడడానికి చాలా గంభీరంగా ఉంటారు. కానీ ఆయన మనసు వెన్న అంటారు చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నవారు. అయితే కాస్త పొగరు, యాటిట్యూడ్ కూడా అక్కడక్కడ చూపిస్తారు అని నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో ఏదైనా సరే నా తర్వాతే అనేలా ఉండాలి అనుకుంటారు అని.. అయితే అది అన్ని విషయాల్లో కుదరదు కదా.. అని కూడా వార్తలు వినిపిస్తూ ఉంటారు.
120 మంది పిల్లలను దత్తత తీసుకున్న మంచు విష్ణు..
ఇకపోతే ఈ విషయం కాస్త పక్కన పెడితే..తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా మంచు విష్ణు ఒక గొప్ప పని చేశారు. ఇక ఆ పని ఏంటో తెలిస్తే మీరందరూ మెచ్చుకోక ఉండలేరు..మరి ఇంతకీ మంచు విష్ణు చేసిన ఆ గొప్ప పని ఏంటంటే.. అనాధ పిల్లల్ని దత్తత తీసుకోవడం.. చాలామంది సెలబ్రిటీలు ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అలా ఇప్పటికే ప్రభాస్, రాంచరణ్,ఉపాసన, మహేష్ బాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి సెలెబ్రెటీలు ఎంతో మందికి జీవితాలను ఇస్తున్నారు. అలా తాజాగా మంచు విష్ణు కూడా ఒక మంచి పని చేయడానికి కంకణం కట్టుకున్నారు. అనాధాశ్రమంలో ఉన్న దాదాపు 120 మంది పిల్లల్ని దత్తత తీసుకొని వారికి సంబంధించిన అన్ని విషయాలను నేనే దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పేశారు.
నా స్వలాభం కోసం దత్తత తీసుకోలేదు..
వాళ్లని నా కుటుంబంలో సభ్యులుగా చూసుకుంటాను. వారిని నేను నా స్వలాభం కోసం దత్తత తీసుకోవడం లేదు అంటూ చెప్పారు. ఇక అసలు విషయం ఏమిటంటే.. తిరుపతి దగ్గర ఉండే బైరాగి పట్టేడ ప్రాంతానికి చెందిన మాతృశ్య సంస్థ నుండి దాదాపు 120 మందిని మంచు విష్ణు దత్తత తీసుకున్నారు.మాతృశ్య సంస్థను శ్రీదేవి నడుపుతున్నారు. వారు ఎంతో మంది అనాధ పిల్లల్ని తీసుకొచ్చి తిండి పెడుతూ చదువు చెప్పిస్తున్నారు.అయితే ఈ విషయం తెలుసుకున్న విష్ణు 120 మంది పిల్లల్ని దత్తత తీసుకొని వారికి సంబంధించిన విద్య, వైద్యం అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే ఎవరైనా సరే అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని ఇలాంటి మంచి పనులు చేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.ప్రతి ఒక్కరూ కూడా అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని, మీకు సమీపంలో ఉన్న అనాధ పిల్లల్ని దత్తత తీసుకొని మీకు తోచిన దాంట్లో సహాయం చేయండి అని చెప్పుకొచ్చారు.
భోగి మంటలతో సందడి చేసిన మోహన్ బాబు కుటుంబం..
ఇక మోహన్ బాబు ఫ్యామిలీ ఈరోజు భోగి పండుగ సందర్భంగా ఉదయాన్నే తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో భోగిమంటలు వేసి సందడి వాతావరణాన్ని నెలకొల్పారు.ఈ భోగి మంటలు వేసే కార్యక్రమంలో మోహన్ బాబు, ఆయన భార్య, మంచు విష్ణు ఆయన భార్య, పిల్లలు పాల్గొన్నారు. ఈ భోగి మంటలు వేశాక మంచు విష్ణు మాట్లాడుతూ.. అందరూ బాగుండాలి. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.. సంక్రాంతి పండుగ అంటే గుర్తుకు వచ్చేది రైతన్న మాత్రమే. దేశానికి అన్నం పెట్టి పోషించేవాడు రైతన్న.. అలాంటి రైతన్న బాగుండాలి. అలాగే మీడియా మిత్రులకు, సినిమా మిత్రులకు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మంచు విష్ణు 120 మంది పిల్లల్ని దత్తత తీసుకున్న విషయం తెలిసి చాలామంది విష్ణు చేసిన పనిని మెచ్చుకుంటున్నారు.