Trinadha Rao Nakkina:ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన (Trinadha Rao Nakkina) పై మహిళా కమిషన్ ఫైర్ అవుతూ త్వరలో నోటీసులు జారీ చేస్తామని తెలిపింది. ముఖ్యంగా ఈవెంట్లో ఈయన చేసిన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద, ఇతడి వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించారు. అంతేకాదు త్రినాథ రావుకు త్వరలోనే నోటీసులు జారీ చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా హీరోయిన్ అన్షు అంబానీ (Anshu Ambani) పై త్రినాథ రావు చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అవుతూ పలు కామెంట్లు చేశారు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద.కాగా, మజాకా (Mazaka)టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ అన్షు అంబానీ పై త్రినాథ రావు నక్కిన అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏ క్షణాన అయినా ఈయనకు నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ నోటీసులు జారీ చేస్తే విచారణలో ఎలా తన తప్పును సమర్ధించుకుంటారో చూడాలని నెటిజన్స్ కూడా ఫైర్ అవుతున్నారు.
హీరోయిన్ పై డైరెక్టర్ అనుచిత వ్యాఖ్యలు..
అసలు విషయంలోకి వెళితే.. డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం మజాకా (Mazaka). ఈ సినిమా టీజర్ లాంఛ్ వెంటనే నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ హీరోయిన్ అన్షు అంబానీ(Anshu Ambani)ను ఉద్దేశిస్తూ.. “ఈమె గత 22 ఏళ్ల క్రితం చాలా బొద్దుగా అందంగా ఉండేది. కానీ ఇప్పుడు సన్నబడిపోయింది. దాంతో నేను కాస్త తిని బరువు పెంచమ్మా.. తెలుగు వాళ్లకు అన్నీ చాలా పెద్దవిగా ఉండాలి” అంటూ తెలిపాను అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ తో అసభ్యకరంగా కామెంట్లు చేశారు. ఈ విషయం విన్న నెటిజెన్స్ సోషల్ మీడియా ద్వారా డైరెక్టర్ పై విమర్శలు గుప్పిస్తూ.. మీ ఇంట్లో ఆడవారిపై కూడా ఇలాగే కామెంట్లు చేస్తావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మజాకా సినిమా విశేషాలు..
డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో యంగ్ హీరో సందీప్ కిషన్ (Sandeep Kishan)హీరోగా, రీతూ వర్మ (Rithu Varma) హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ఇది. ప్రముఖ హీరోయిన్ అన్షు అంబానీ ఈ సినిమా ద్వారా దాదాపు 22 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తోంది. ఇందులో రావు రమేష్(Rao Ramesh) కి జోడిగా ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. గతంలో నాగార్జున(Nagarjuna ) హీరోగా నటించిన ‘మన్మధుడు’ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్గా నటించిన ఈమె, ఆ తరువాత ప్రభాస్(Prabhas ) ‘రాఘవేంద్ర’ సినిమాలో నటించింది. ఇక ‘మిస్సమ్మ’ సినిమాలో చివరిగా నటించిన ఈమె.. ఒక తమిళ్ చిత్రంలో కూడా నటించింది. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమై పెళ్లి చేసుకొని లండన్ లో సెటిల్ అయిపోయింది. ఇక ఇప్పుడు మళ్లీ చాలా ఏళ్ల తర్వాత తెలుగులో రీయంట్రి ఇస్తోంది. అందం విషయంలో ఏమాత్రం తేడా లేకపోయినా.. కాస్త బక్క చిక్కిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవాలని , మళ్లీ కం బ్యాక్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.