BigTV English

Joy Land : ఆస్కార్ రేసులో తెలుగు అమ్మాయి సినిమా..

Joy Land : ఆస్కార్ రేసులో తెలుగు అమ్మాయి సినిమా..

Joy Land : రీసెంట్‌గా అకాడ‌మీ అవార్డ్స్ రేసులో ఉన్న సినిమాలు వాటికి సంబంధించిన వివ‌రాల‌ను క‌మిటీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో మ‌న తెలుగు సినిమా రేంజ్‌ను పెంచేలా RRR సినిమా నుంచి నాటు నాటు సాంగ్ నిలిచిన సంగ‌తి తెలిసిందే. తెలుగు వారంద‌రూ గ‌ర్వ‌ప‌డే మ‌రో విష‌యం ఇప్పుడు తెలిసింది. అదేంటంటే ఆస్కార్ బ‌రిలో నిలిచిన తొలి పాకిస్థానీ సినిమా జాయ్ లాండ్. ఈ సినిమాను ఆస్కార్ బ‌రిలో నిలిచే క్ర‌మంలో చాలా స‌వాళ్ల‌నే ఎదుర్కొంది. జాయ్ లాండ్ సినిమాపై ఘాటు విమ‌ర్శ‌లు రావ‌టంతో పాక్ ప్ర‌భుత్వం సినిమాను నిషేధించింది. అయితే సినిమా మాత్రం పాకిస్థాన్ పేరుని అంత‌ర్జాతీయ స్థాయిలో నిల‌బెట్టేన‌లా అకాడ‌మీ రేసులో నిల‌వ‌టం విశేషం.


ఇదంతా బాగ‌నే ఉంది కానీ.. తెలుగు అమ్మాయికి, పాకిస్థానీ సినిమాకు ఏంటి సంబంధం అని అనుకుంటున్నారా? అస‌లు విష‌య‌మేమంటే.. జాయ్ లాండ్ సినిమాను నిర్మించింది. ఓ తెలుగు అమ్మాయి. ఆమె పేరు అపూర్వ చ‌ర‌ణ్‌. హైద‌రాబాద్‌లో పుట్టిన అపూర్వ‌.. త‌ర్వాత కుటుంబంతో అమెరికా వెళ్లిపోయారు. అక్క‌డే ఆమె షార్ట్ ఫిలింస్‌ను కూడా నిర్మించారు. ఈ క్ర‌మంలోనే ఫ్రెండ్స్ ద్వారా జాయ్ లాండ్ క‌థ‌ను తెలుసుకుని నిర్మించారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో జ్యూరి మ‌న్న‌న‌లు పొందిన ఈ చిత్రం ఉత్త‌మ స్త్రీ వాద చిత్రంగా నిలిచింది. దాంతో పాకిస్థాన్ ప్ర‌భుత్వం ఈ సినిమాను ఆస్కార్ అవార్డుల‌కు పంప‌గా.. బెస్ట్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫీచ‌ర్ ఫిల్మ్ విభాగంలో జాయ్ లాండ్ పోటీలోకి నిలిచింది.

సాదిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అలీ జునేజో, రస్తీ ఫరూక్, అలీనా ఖాన్, సర్వత్ గిలానీ, సల్మాన్ పీర్జాదా తదితరులు కీలక పాత్రలు పోషించారు. పెళ్లైన క‌థానాయ‌కుడు ట్రాన్స్ జెండ‌ర్ ప్రేమ‌లో ప‌డితే ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌వుతాయ‌నేదే సినిమా క‌థాంశం.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×