E-Paper
Advertisement

Ram Charan RC15 Look :  రాజమండ్రిలో రామ్ చరణ్ రాజకీయం

Ram Charan RC15 Look :  రాజమండ్రిలో రామ్ చరణ్ రాజకీయం
Advertisement

Ram Charan RC15 Look :  మెగా పవర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ పాలిటిక్స్ ప్ర‌చారంలో బిజీగా ఉన్నారు. అదేంటి ఇప్పుడేం తెలుగు రాష్ట్రాల్లో కానీ..ఇత‌ర రాష్ట్రాల్లో కానీ ఎలాంటి ఎన్నిక‌లు జ‌ర‌గ‌టం లేదే. మ‌రేంటి చ‌ర‌ణ్ పాలిటిక్స్‌లో బిజీగా ఉండ‌టం అనే సందేహం రాక మాన‌దు. అస‌లు విష‌య‌మేమంటే.. రామ్ చ‌ర‌ణ్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ పాన్ ఇండియా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. RC 15 వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్‌ను రాజ‌మండ్రిలోని గోదావ‌రి న‌దీ ప్రాంతంలో చిత్రీక‌రిస్తున్నారు. అందులో భాగంగా అక్క‌డ రాజ‌కీయ పార్టీ మీటింగ్ సెట్‌ను వేశారు. రామ్ చ‌ర‌ణ్, శ్రీకాంత్‌ల‌పై ఫ్లాష్ బ్యాక్ స‌న్నివేశాల‌ను షూట్ చేస్తున్నారు.

నెట్టింట రామ్ చ‌ర‌ణ్ లుక్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ ముఖ్య‌మంత్రి పాత్రలో క‌నిపిస్తార‌నే వార్త‌ల‌ను మ‌నం వినే ఉంటాం. వాటికి సంబంధించిన స‌న్నివేశాల‌ను ఇప్పుడు చిత్రీక‌రిస్తున్నారు. రూ.400 కోట్ల బ‌డ్జెట్‌తో తెలుగు నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్ RC 15ను పాన్ ఇండియా రేంజ్ మూవీగా రూపొందిస్తున్నారు. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నార‌ని టాక్‌

Advertisement

RC 15లో రామ్ చ‌ర‌ణ్ డ్యూయెల్ రోల్‌. అందులో ఓ పాత్రను ముఖ్య‌మంత్రిగా క‌నిపిస్తే.. మ‌రో పాత్రను ఎన్నిక‌లను నిర్వ‌హించే ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా ఆయ‌నే చేస్తున్నారు. . కియారా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో ఎస్‌.జె.సూర్య‌, సునీల్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×