BigTV English
Advertisement

Robot guides : ఈ రోబో చాలా స్మార్ట్! డాక్టర్ సాయం లేకుండానే ఊపిరితిత్తుల్లోకి సూదిని దూర్చిన రోబో

Robot guides : ఈ రోబో చాలా స్మార్ట్! డాక్టర్ సాయం లేకుండానే ఊపిరితిత్తుల్లోకి సూదిని దూర్చిన రోబో

Robot guides : రకరకాల రోబోలు వచ్చేశాయి. దాదాపు అన్ని రంగాల్లో వీటిని విరివిగా వాడుతున్నారు. ఈ మరమనుషులు ఇంట్లో పనిమనుషులుగానూ పనిచేస్తున్నాయి. మొన్నామధ్య వచ్చిన యాంకర్ రోబో… వార్తలు కూడా చదివి ప్రపంచ ప్రజలను నివ్వెరపరిచింది. ఈ హ్యూమనాయిడ్ రోబో అచ్చు మనిషిగా భ్రమింపచేస్తుంది. ఈ రోబోల పుణ్యమా అని ఆటోమేషన్ వచ్చి ఉద్యోగాలు కూడా ఊడుతున్నాయి. చివరికి ఎంతో క్లిష్టమైన వైద్య రంగంలోకి కూడా రోబోలు వచ్చి చేరాయి. డాక్టర్లు వీటిని అత్యంత సున్నితమైన సర్జరీలు చేయడానికి వినియోగిస్తున్నారు. కొన్ని సర్జరీలు చేతితో చేయడం కాస్త కష్టమే. అందుకే రోబోలను వినియోగిస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఒక రోబో.. డాక్టర్ సాయం లేకుండానే పంది ఊపిరి తిత్తిలోకి మ్రుదువైన సూదిని దూర్చి రికార్డు స్రుష్టించింది. అది కూడా పంది ఊపిరితిత్తికి ఎలాంటి నష్టం కలగనివ్వకుండా చాలా జాగ్రత్తగా సూదిని దూర్చడం డాక్టర్లనే ఆశ్చర్యపర్చింది.


యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా పరిశోధకులు ఈ రోబోను రూపొందించారు. ఇది డాక్టర్లకన్నా మరింత కచ్చితంగా సూదిని ఊపిరితిత్తుల్లోకి జొప్పించడం విశేషం. కణజాలాల్లోంచి చిన్న ముక్కను తీయడం, నిర్దేశిత భాగానాకి మందులను ఇవ్వడం వంటి వాటికి సూదులను వినియోగిస్తుంటారు. ఇలాంటి ప్రక్రియలకు కొత్త రోబో పరిజ్జానం ఎంతగానో ఉపయోగపడగలుగుతుందని భావిస్తున్నారు. దీన్ని పరీక్షించడానికి ముందుగా పందుల లంగ్స్ లో క్యాన్సర్ కణితిని 3డీ ఎక్స్ రేలుగా తీసి కంప్యూటర్ సాఫ్ట్ వేర్ తో పటాన్ని రూపొందించారు. ఆ తర్వాత రోబో నియంత్రణలో పనిచేసే సూదికి పని అప్పగించారు. ఇది ఊపిరితిత్తి కణజాలం ద్వారా లోపలికి వెళ్లి కచ్చితంగా కణితి వరకు చేరింది. అత్యంత మ్రుదువుగా ఉండడం వల్ల గాలి గదులకు, రక్తనాళాలకు ఎలాంటి హాని కలిగించలేదు. ఎంతో చాకచక్యంగా అడ్డంకులను తప్పించుకుంటూ టార్గెట్ ని రీచ్ అయింది. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ఇకముందు వీటితో అత్యంత సున్నితమైన సర్జరీలు చేపట్టే వీలుందని నిపుణులు భావిస్తున్నారు.


Tags

Related News

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

OTT Movie : పొలంలో శవాల పంట… తలలేని మొండాలతో ఊరు ఊరంతా వల్లకాడు… అల్టిమేట్ యాక్షన్ తో అదరగొట్టే మూవీ

Big Stories

×