BigTV English

NTR: స్టార్ డైరెక్టర్‌తో కొత్త సినిమా ప్రకటించిన ఎన్టీఆర్.. వంశీ ఇక నీకుంటది..!

NTR: స్టార్ డైరెక్టర్‌తో కొత్త సినిమా ప్రకటించిన ఎన్టీఆర్.. వంశీ ఇక నీకుంటది..!

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు. దేవర తర్వాత వార్ 2 మొదలు పెట్టిన టైగర్.. ఆల్మోస్ట్ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్‌ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. అతి త్వరలోనే ఈ సినిమా షూటాంగ్‌లో జాయిన్ అవనున్నాడు. ఇప్పటికే సరికొత్తగా మేకోవర్ అవుతున్నాడు. ఆ తర్వాత దేవర 2 చేయనున్నాడు. అలాగే.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ నెల్సన్ దిలీప్ కుమార్‌తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే నిర్మాత నాగవంశీ ఈ సినిమాను కన్ఫామ్ చేయగా.. తాజాగా ఎన్టీఆర్ కూడా కన్ఫర్మేషన్ ఇచ్చాడు. మార్చి 28న విడుదలైన‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన నేపథ్యంలో.. సక్సెస్‌ మీట్ నిర్వహించారు. ఈ మీట్‌కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా తారక్ మాట్లాడుతూ నిర్మాత నాగవంశీతో కొత్త సినిమా ఫిక్స్ అయిందని చెప్పుకొచ్చాడు.


వంశీనే ఇన్‌ఛార్జ్

మ్యాడ్ స్క్వేర్ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్ చెప్పిన ఎన్టీఆర్.. అత్తారింటికి దారేదిలో ఒక డైలాగ్‌ను చెప్పాడు. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. మీ వెనకాల కనబడని ఒక శక్తి ఉంది అని, వీళ్ళందరి వెనుక ఆ కనబడని శక్తే మా చింటు నాగవంశీ. సినిమా అంటే చాలా చాలా ప్యాషన్ తనకి. మాట కరుకుగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది కానీ, మనసు చాలా మంచిది. ఆ మంచితనమే తనని కాపాడుతుంది. ఆ మంచితనమే ఒక కనబడని శక్తిగా వీళ్లను ముందుకు తీసుకెళ్లింది. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి మీ అందరికీ. బాగా సుఖ పడిపోయాడు వంశీ. త్వరలోనే ఒక సినిమా చేయబోతున్నాం. తనే ఒక రోజు సందర్భం వచ్చినప్పుడు చెబుతాడు. వంశీ సమర్పకుడిగా కాదు.. ప్రొడ్యూసర్‌గా తన పేరు పడిన తర్వాత.. ఆ సినిమా మొదలు పెట్టిన రోజు.. మీ అందరిని హ్యాండిల్ చేయమని తనని వదిలేయబోతున్నాను, నాకు సంబంధం లేదు. మీరు తిట్టుకోవాలన్నా, కొట్టుకోవాలన్న వంశీనే ఇన్‌ఛార్జ్ మీకు. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో సునీల్ అనుభవించు రాజా అన్నట్టుగా.. వెంకటేష్‌లాగా కూర్చొని నేను ఎంజాయ్ చేస్తాను. ఆ టార్చర్ వంశీనే పడాలి అని అన్నాడు.


ఎన్టీఆర్-నెల్సన్ కాంబో ఫిక్స్!

జైలర్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో సినిమా చేయబోతున్నట్టుగా చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. ఈ సినిమాను నాగవంశీ నిర్మించనున్నట్టుగా పలు సందర్భాల్లో తనే చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఎన్టీఆర్ నెల్సన్ పేరు ఎత్తలేదు గానీ, ఆయన చెప్పింది నెల్సన్‌ ప్రాజెక్ట్ గురించేనని చెప్పాలి. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీ కాంత్‌తో జైలర్ 2 చేస్తున్నాడు నెల్సన్. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పై ఫోకస్ చేయనున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్‌కు కథ చెప్పగా.. బాగా నచ్చినట్టుగా చెబుతున్నారు. ఇక ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్‌లో ఎన్టీఆర్ స్వయంగా నాగవంశీతో సినిమా ప్రకటించడంతో ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్టే!

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×