BigTV English

NTR: తారక్ నోట పవన్ కళ్యాణ్ డైలాగ్.. కేరింతలే కేరింతలు

NTR: తారక్ నోట పవన్ కళ్యాణ్ డైలాగ్.. కేరింతలే కేరింతలు

NTR: ఈరోజుల్లో ఒక సినిమా సక్సెస్ అవ్వగానే వెంటనే దానికి సక్సెస్ మీట్ పెట్టేస్తున్నారు. ఇక ఇటీవల విడుదలయిన సినిమాల్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని ఎంటర్‌టైన్ చేసిన సినిమా ‘మ్యాడ్ స్క్వేర్’. నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ హీరోలుగా నటించిన ఈ మూవీ ఇటీవల విడుదలయ్యి మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. అందుకే ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం స్పెషల్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ సక్సెస్ మీట్ కోసం ఎన్‌టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. తనతో పాటు త్రివిక్రమ్ కూడా గెస్ట్‌గా వచ్చినా ఎన్‌టీఆర్ స్పీచే హైలెట్ అయ్యిందని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. అంతే కాకుండా తారక్ నోట్ పవన్ కళ్యాణ్ డైలాగ్ విని మరింత ఖుషీ అవుతున్నారు.


హీరోలపై ప్రశంసలు

‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ చూసి బాగా ఎంజాయ్ చేసిన ఎన్‌టీఆర్.. అందులోని ప్రతీ యాక్టర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. ముగ్గురు హీరోల గురించి మాత్రమే కాదు.. ఇందులో సైడ్ యాక్టర్స్‌గా కనిపించిన వారి గురించి ప్రస్తావించాడు ఎన్‌టీఆర్. నార్నే నితిన్ సొంత బావమరిది అయినా కూడా హీరో అవ్వాలని అనుకున్నప్పుడు తాను ఏ మాత్రం సపోర్ట్ ఇవ్వనని చెప్పేశాడట ఎన్‌టీఆర్. ఆ సందర్భాన్ని ఇప్పుడు గుర్తుచేసుకుంటూ తను హీరోగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడని అన్నాడు. సంగీత్ శోభన్ తండ్రి మరణించి చాలాకాలమే అయినా తన తండ్రి ఎక్కడున్నా తన పర్ఫార్మెన్స్ చూసి సంతోషిస్తారని చెప్పాడు. రామ్ నితిన్ యాక్టింగ్ కూడా బాగుందని ప్రశంసించాడు.


అత్తారింటికి దారేది డైలాగ్

కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మ్యాడ్ స్క్వేర్’ను నాగవంశీ తన సొంత బ్యానర్ అయిన సితార ఎంటర్‌టైన్మెంట్స్‌పై నిర్మించాడు. మామూలుగా ప్రొడ్యూసర్స్ అందరిలో నాగవంశీ స్టైలే వేరు అని అంటుంటారు. అందుకే ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం నాగవంశీ స్వయంగా ప్రమోట్ చేశాడు. నాగవంశీని ప్రశంసిస్తూ సక్సెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పాడు ఎన్‌టీఆర్. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ‘‘మీ వెనుక ఏదో శక్తి ఉంది అన్నట్టు వీరందరి వెనుక ఒక శక్తి ఉంది. తనే వంశీ’’ అని అన్నాడు. ‘‘సినిమా అంటే తనకు చాలా ప్యాషన్. మనిషి మాట చాలా దురుసుగా ఉంటుంది. కానీ అంతకంటే మంచి మనిషిని నేను ఇప్పటివరకు కలవలేదు’’ అని ప్రశంసించాడు ఎన్‌టీఆర్.

Also Read: రజినీకాంత్ ‘కూలీ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎన్‌టీఆర్‌తో పోటీపడనున్న సూపర్ స్టార్

నాగవంశీనే టార్గెట్

‘‘ఆ మంచితనమే నాగవంశీని కాపాడుతుంది. ఆ మంచితనమే అందరినీ శక్తిలాగా నడిపిస్తుంది. తన గురించి ఎక్కువ మాట్లాడితే దిష్టి తగిలేస్తుందేమో. ఇప్పటికే నాగవంశీ బాగా సుఖపడ్డాడు. అందుకే త్వరలోనే ఒక సినిమా చేయబోతున్నాం’’ అని అప్డేట్ ఇచ్చాడు ఎన్‌టీఆర్. నాగవంశీతో సినిమా చేస్తున్నానని అప్డేట్ ఇచ్చిన రోజు ఫ్యాన్స్‌ను హ్యాండిల్ చేయమని తననే వదిలేస్తానని నవ్వుతూ అన్నాడు. తిట్టుకోవాలన్నా, కొట్టుకోవాలన్నా ఫ్యాన్స్‌కు వంశీనే ఇన్‌ఛార్జ్ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. తాను అనుభవించు రాజా అంటూ చిల్ అవుతానని అన్నాడు. అలా ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) సక్సెస్ మీట్‌కు వచ్చి అందరినీ ఎంటర్‌టైన్ చేశాడు ఎన్‌టీఆర్.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×