Ranbir Kapoor: ఈరోజుల్లో సౌత్ నటీనటులంతా బాలీవుడ్ వైపు చూస్తుంటే బాలీవుడ్ నటీనటులు హాలీవుడ్ వైపుకు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూసే ఇంగ్లీష్ సినిమాల్లో నటించాలని చాలామందికి కోరిక ఉంటుంది. అలా ఇప్పటికే ఎంతోమంది బీ టౌన్ నటీనటులు పలు ఇంగ్లీష్ సినిమాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి హ్యాండ్సమ్ హీరో రణబీర్ కపూర్ కూడా యాడ్ అవ్వనున్నాడని సమాచారం. ప్రస్తుతం రణబీర్ కపూర్ హాలీవుడ్ ఎంట్రీ గురించి బీ టౌన్‌లో హాట్ టాపిక్ నడుస్తోంది. చేతి నిండా హిందీ సినిమాలతోనే బిజీ అయిపోయిన రణబీర్.. ఇప్పుడు నిజంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా అని అందరిలో సందేహం మొదలయ్యింది.
హాలీవుడ్ ఎంట్రీ
ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోలకు చలామణి అవుతున్న ఎవ్వరూ హాలీవుడ్ వరకు వెళ్లలేదు. బీ టౌన్‌లోనే వారికి అమితంగా ప్రేమ, ఆదరణ, ఫేమ్ లభించడం వల్ల వీరెవ్వరూ హాలీవుడ్ వైపు దృష్టి పెట్టలేదు. కానీ నటీనటుల ఆలోచన తీరు కూడా మారుతూ వస్తోంది. ఎలాగైతే పాన్ ఇండియా సినిమాల వల్ల పాన్ ఇండియా రేంజ్‌లో పాపులారిటీ లభిస్తుందని అనుకుంటున్నారో.. అదే విధంగా హాలీవుడ్ సినిమాలో నటిస్తే పాన్ వరల్డ్ రేంజ్‌లో పాపులారిటీ లభిస్తుందని ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇండియన్ యాక్టర్లకు, ఇండియన్ సినిమాలకు హాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఉండడంతో రణబీర్ కపూర్ హాలీవుడ్ ఎంట్రీ ఈజీ అని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు.
ప్రేక్షకులు ఫిదా
హాలీవుడ్‌లో ఎన్నో ఫేమస్ ఫ్రాంచైజ్ సినిమాలు ఉన్నాయి. అందులో జేమ్స్ బాండ్ కూడా ఒకటి. ఈ ఫ్రాంచైజ్‌లో తెరకెక్కనున్న తరువాతి జేమ్స్ బాండ్ సినిమాలో రణబీర్ కపూర్ నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మైఖేల్ బే దర్శకత్వంలో రానున్న ఈ మూవీలో రణబీర్‌ను తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇదే నిజమయితే ఈ యాక్టర్‌కు హాలీవుడ్‌లో కూడా మంచి అవకాశాలు రావడం పక్కా అని ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో ప్రామిసింగ్ నటుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు రణబీర్ కపూర్. ఇక తన యాక్టింగ్ టాలెంట్‌ను హాలీవుడ్‌లో కూడా చూపిస్తే అక్కడి ప్రేక్షకులు కూడా ఫిదా అవ్వడం పక్కా అని అనుకుంటున్నారు.
Also Read: లైంగిక వేధింపుల కేసు.. 80 ఏళ్ల నటుడికి జైలుశిక్ష
ఫ్రాంచైజ్‌తో బిజీ
రణబీర్ కపూర్ (Ranbir Kapoor) చివరిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’తో ప్రేక్షకులను అలరించాడు. తన కెరీర్‌లో ఎక్కువగా లవర్ బాయ్ లుక్‌లోనే కనిపించిన రణబీర్.. ‘యానిమల్’ కోసం ఒక్కసారిగా రఫ్ లుక్స్‌లోకి మారిపోయాడు. ఈ కథ, కథనం, అందులో రణబీర్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ‘యానిమల్’ను ఒక్క సినిమాతో ముగించేయకుండా దీనిని ఒక ఫ్రాంచైజ్‌లాగా ప్లాన్ చేశాడు సందీప్ రెడ్డి వంగా. ఈ ఫ్రాంచైజ్ తెరకెక్కడానికి ఇంకా సమయం ఉండడంతో ప్రస్తుతం ‘రామాయణ్’పై దృష్టి పెడుతున్నాడు రణబీర్ కపూర్. దాంతో పాటు ఇప్పుడు ఈ హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా యాడ్ అయ్యింది.