Jr NTR : ప్రముఖ హీరో ఎన్టీఆర్ (NTR) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇక రీసెంట్గా ‘దేవరా’ సినిమాతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇటు దేవర సినిమా రిలీజ్ అయిన తర్వాత అభిమానులు కూడా ఫుల్ ఖుషి లో ఉన్నారు. ఎక్కడ చూసినా సరే ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ ద్విపాత్రలో చాలా అద్భుతంగా ఒదిగిపోయి నటించారు. ఇందులో బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్ (Sai Ali Khan)విలన్ గా, జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్గా నటించారు. అంతేకాదు జాన్వీ కపూర్ తొలిసారి తెలుగు తెరకు ఈ సినిమా ద్వారానే పరిచయమయ్యింది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.172 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. మొత్తంగా రూ.550 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది.అంతేకాదు ఆరు కేంద్రాలలో వంద రోజులు మరో రెండు కేంద్రాలలో కంటిన్యూస్ గా వంద రోజులు పూర్తి చేసుకొని ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఇకపోతే 2024 నవంబర్ 8 నుండి నెట్ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.
Odela 2: అఫీషియల్… ఓదెలా 2 రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
జపాన్ లో ఎన్టీఆర్ కి భారీ క్రేజ్..
ఇక ఇలాంటి ఈ చిత్రాన్ని ఇప్పుడు జపాన్లో కూడా విడుదల చేయడానికి సిద్ధం అవుతోంది చిత్ర బృందం. 2025 మార్చి 19వ తేదీన జపాన్లో ప్రైవేటు రివ్యూ స్క్రీనింగ్ జరగగా.. అక్కడ కూడా దేవర సినిమాకి బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో అభిమానులలో ఉత్సాహం రెట్టింపు అయింది. ఇక ఎన్టీఆర్ కి అటు జపాన్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలై అక్కడ భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఎన్టీఆర్ కి కూడా మంచి క్రేజ్ అందించింది.. ఇక ఇప్పుడు జపాన్లో కూడా రిలీజ్ కాబోతుండడంతో.. జపాన్లో అభిమానులు సందడి చేయడం మొదలుపెట్టారు. ఇక దీన్ని బట్టి చూస్తే తెలుగులో కూడా లేనంత క్రేజ్ జపాన్లో ఎన్టీఆర్ దక్కించుకున్నారని చెప్పవచ్చు.
ఎన్టీఆర్ కటౌట్ కి పూజ చేస్తున్న జపాన్ అమ్మాయిలు..
అంతేకాదు ఇందుకు ఉదాహరణగా ఒక వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఎన్టీఆర్ కటౌట్ పెట్టి, దానికి కొంతమంది జపాన్ అమ్మాయిలు పూజ కూడా చేసేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా ‘దేవర – పార్ట్ 2’ గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. అటు కొరటాల శివ (Koratala Shiva) కూడా ‘పుష్ప2’ సినిమా రేంజ్ లో యాక్షన్ పర్ఫామెన్స్ తో ఊహించని కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎన్టీఆర్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
ఎన్టీఆర్ సినిమాలు..
ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ఎన్టీఆర్ బాలీవుడ్ లో హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరోగా నటిస్తున్న ‘వార్ 2’ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయింది. ఇక మరొకవైపు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం
🇮🇳祝デーヴァラ日本公開🇯🇵
インドのファンが建物の上からざばーって垂れ幕を下ろすアレに憧れて、ミニ垂れ幕を作りました。@devaramovie_jp. #DEVARA #デーヴァラ #DevaraInJapan pic.twitter.com/FjAP0hbuce
— 🇯🇵 ぼらこ నా పేరు నావోరి / Nickname:Shilpa (@QUEENjiyko) March 21, 2025