BigTV English

Devara 2 UpDate : దూకే ధైర్యమా జాగ్రత్త… దేవర 2 వచ్చేస్తున్నాడు

Devara 2 UpDate : దూకే ధైర్యమా జాగ్రత్త… దేవర 2 వచ్చేస్తున్నాడు

Devara 2 UpDate : ఆర్ఆర్ఆర్ తర్వాత అదే అంచనాలతో తారక్ చేసిన మూవీ దేవర. అలాగే ఆచార్య డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ నుంచి వచ్చిన మూవీనే ఈ దేవర. అటు తారక్‌ సక్సెస్ కొనసాగించాలి. ఇటు కొరటాల తన డిజాస్టర్ నుంచి బయటపడాలి. అలా… సినిమా అవుట్ పుట్ రావాలి. ఇది దేవర రిలీజ్ కి ముందు ఉన్న అంచనాలు.


అలాంటి అంచనాలు అన్నింటినీ అందుకుని మంచి విజయాన్ని అందుకుంది దేవర. ఫైనల్ రన్ వరకు ఈ మూవీ దాదాపు 500 కోట్లు కలెక్ట్ చేసి పెట్టింది. దీంతో తారక్ ఆర్ఆర్ఆర్ తర్వాత అదేే సక్సెస్ ను కంటిన్యూ చేస్తున్నాడు. అలాగే ఆచార్య డిజాస్టర్ నుంచి కొరటాల శివ బయటికి వచ్చాడు.

ఇంత సక్సెస్ అయిన మూవీ సీక్వెల్ ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. దేవరను వర ఎందుకు చంపాడు అనే క్వశ్చన్ తో పాటు యేతి ఎవరు..? సముద్రగర్భంలో ఉన్న అస్థిపంజరాలు ఎవరివి..? అసలు దేవర కథ చెప్పిన ప్రకాష్ రాజ్ ఎవరు..? లాంటి ఎన్నో ట్విస్ట్ లు ఇప్పుడు రాబోయే దేవర పార్ట్ 2లో తెలియనున్నాయి. అందుకే ఈ పార్ట్ 2 కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.


ఈ సమయంలో ఓ గుడ్ న్యూస్ బయటికి వచ్చింది. దేవర 2 పనులను డైరెక్టర్ కొరటాల శివ స్టార్ట్ చేయబోతున్నాడట. ఇప్పటికే ఫైనల్ స్క్రిప్ట్ కంప్లీట్ అయిందని సమాచారం. అలాగే… జూలై నుంచి ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా డైరెక్టర్ కొరటాల శివ స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం అందుతుంది. జూలైలో ప్రీ ప్రొడక్షన్ అంటే… అతి తర్వలోనే సెట్స్ పైకి కూడా వెళ్లే ఛాన్స్ ఉంది.

కాగా, జూనియర్ ఎన్టీఆర్ లైన్ అప్‌లో దేవర 2 మూవీ… నెల్సాన్ తో చేస్తున్న ప్రాజెక్ట్ తర్వాత ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ, ఇటీవల అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రమోషన్స్ లో నందమూరి కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చాడు. ఎన్టీఆర్ నీల్ మూవీ తర్వాతే దేవర 2 ఉంటుందని చెప్పాడు. దేవర 2 తర్వాతే నెల్సన్ మూవీ సెట్స్ పైకి వెళ్తుందని చెప్పి… దేవర 2పై వస్తున్న గాసిప్స్ అన్నింటికీ బ్రేక్ వేశాడు.

అన్నీ కుదిరితే… బర్త్ డేకి సర్ప్రైజ్..?

జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే ఈ నెల 20న రాబోతుంది. ఈ రోజు ఒక్క ట్రీట్ కాదు.. ఫ్యాన్స్ కు మూడు ట్రీట్స్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇప్పటికే వార్ 2లో తారక్ లుక్ కు సంబంధించిన గ్లింప్స్.. మే 20న రాబోతుంది అనే టాక్ వస్తుంది. దీంతో పాటు ఎన్టీఆర్ నీల్ మూవీ నుంచి కూడా మే 20న అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.

వీటితో పాటు దేవర 2 నుంచి కూడా బర్త్ డే రోజు ఫ్యాన్స్ కు కొరటాల సర్ప్రైజ్ ఇచ్చే అవకాశం లేకపోలేదు అంటూ ఇండస్ట్రీలో టాక్ అయితే వినిపిస్తుంది. ఇది ఎంత వరకు నిజమో తెలీదు కానీ, దేవర 2 అప్డేట్ కూడా వస్తే… ఫ్యాన్స్ కు ట్రిపుల్ ట్రీట్ అవుతుంది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×