BigTV English

NTRNeel : మళ్లీ సముద్రంపై యుద్దం చేస్తున్న తారక్… ఇప్పుడు నీల్ మావా స్టైల్‌తో..!

NTRNeel : మళ్లీ సముద్రంపై యుద్దం చేస్తున్న తారక్… ఇప్పుడు నీల్ మావా స్టైల్‌తో..!

NTRNeel : యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR ), రాజమౌళి (Rajamouli)దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్థాయి ఇమేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత అదే రేంజ్ లో కథలను వింటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎన్టీఆర్. అందులో భాగంగానే కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేశారు. ఈ సినిమా మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. క్రమేనా ఆడియన్స్ ను ఆకట్టుకోవడంతో సైలెంట్ గా రూ.600 కోట్ల క్లబ్లో చేరి హిట్ గా నిలిచింది. మరోవైపు ఈ సినిమా సీక్వెల్ కూడా రాబోతున్న విషయం తెలిసిందే..అయితే ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కించడానికంటే ముందే ‘కేజిఎఫ్ 1,2’ చిత్రాలతో పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నారు.


ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్లో పాల్గొన్న ఎన్టీఆర్..

‘#NTR 31’అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రానికి తాత్కాలికంగా డ్రాగన్(Dragon ) అనే పేరును పెట్టిన విషయం తెలిసిందే. కానీ సినిమా టైటిల్ పై అధికారికంగా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఇకపోతే ఈ సినిమా షూటింగు ఈ ఏడాది ప్రారంభంలోనే మొదలయ్యింది. దాదాపు 1500 మంది జూనియర్ ఆర్టిస్టులతో హైదరాబాదులోనే ఒక భారీ సెట్ వేసి మరీ ప్రశాంత్ నీల్ కొంత షెడ్యూల్ పూర్తి చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్లోకి ఎన్టీఆర్ కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈయన ఈ సినిమా మొదటి రోజు నుంచి షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. కానీ ఈయన బాలీవుడ్లో హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటిస్తున్న ‘వార్ 2’ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నారు. అక్కడ తన పాత్ర షూటింగ్ పూర్తయ్యే వరకు ఈ సినిమాలో పాల్గొనలేదు. ఇక ఆ సినిమా షూటింగ్ పూర్తి అవడంతో ఇప్పుడు ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్లో పాల్గొన్నారు ఎన్టీఆర్.


మళ్లీ సముద్ర జలాల పైనే షూటింగ్..

అందులో భాగంగానే తాజాగా ఈ సినిమా షూటింగు ప్రస్తుతం కర్ణాటకలోని ‘కుంటా’ అనే ప్రాంతంలో శరవేగంగా జరుగుతోంది. అటు ఎన్టీఆర్ , ఇటు ఫైటర్ల మధ్య తీవ్రమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అది కూడా సముద్రం మీద ఒక ప్రధాన యాక్షన్ సన్నివేశాన్ని డైరెక్టర్ చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ విషయం తెలిసి మళ్ళీ సముద్రంపై ఎన్టీఆర్ షూటింగ్ చేస్తున్నారా అంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఆడియన్స్. ఎందుకంటే ఇదివరకే కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమాలో కూడా ఎన్టీఆర్ సముద్ర జలాల పైనే యాక్షన్ సీక్వెన్స్ చేసి ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఆ సీక్వెన్స్ చేయడానికి ఎంతో కష్టపడ్డారు కూడా. సముద్ర జలాలపై, సముద్రంలోను ఎన్టీఆర్ భారీగా కష్టపడ్డారు. అయితే అది కొరటాల వెర్షన్ లో ..ఇప్పుడు మళ్లీ అదే సముద్ర జలాల పైన యాక్షన్ ఎపిసోడ్స్ కాకపోతే డైరెక్టర్ ప్రశాంత్ వెర్షన్లో లో పాల్గొంటున్నారు. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో ‘సప్త సాగరాలు దాటి’ హీరోయిన్ రుక్మిణి వసంత్ (Rukhmini vasanth) హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఈమె ఎన్టీఆర్ సరసన నటించబోతోంది.

ALSO READ:Balagam Actor: బలగం నటుడికి తీవ్ర అస్వస్థత.. అలాంటి సమస్యతో..!

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×