BigTV English
Advertisement

Modi : సింగరేణిలో 51 శాతం వాటా ఎవరిది?..ప్రైవేటీకరణపై మోదీ క్లారిటీ

Modi : సింగరేణిలో 51 శాతం వాటా ఎవరిది?..ప్రైవేటీకరణపై మోదీ క్లారిటీ

Modi : తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. తొలుత ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ను మోదీ సందర్శించారు. అనంతరం ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని మైదానంలో రైతులతో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్నారు. అక్కడ నుంచి ఎరువుల కర్మాగారాన్ని, భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకు నిర్మించిన రైలు మార్గాన్ని జాతికి అంకితం చేశారు. ఇదే వేదికపై నుంచి రూ.2,268 కోట్లతో చేపట్టే మెదక్‌-సిద్దిపేట-ఎల్కతుర్తి హైవే విస్తరణ పనులు, బోధన్‌-బాసర-భైంసా హైవే పనులకు, సిరొంచా – మహాదేవ్‌పూర్‌ జాతీయ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.


అభివృద్ధి పథం
ఎరువుల కర్మాగారం, రైల్వేలైన్‌, రోడ్ల విస్తరణతో తెలంగాణకు ఎంతో మేలు జరుగుతుందని ప్రధాని అన్నారు. అభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. కొత్త ప్రాజెక్టులతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని చెప్పారు. ప్రపంచలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించిందని ప్రకటించారు. 8 ఏళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకే ప్రాధాన్యం ఇచ్చామని వివరించారు. అభివృద్ధి పనుల మంజూరు ప్రక్రియలో వేగం పెంచామన్నారు. శంకుస్థాపనలకే పరిమితం కాలేదు వాటిని వేగంగా పూర్తి చేసి చూపించామని మోదీ స్పష్టం చేశారు.

భారత్ యూరియా బ్రాండ్
యూరియాను విదేశాల నుంచి అధిక ధరకు దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని మోదీ తెలిపారు. రైతులకు ఎరువుల కొరత రాకుండా అనేక చర్యలు చేపట్టామన్నారు. 5 ప్రాంతాల్లో ఎరువుల కర్మాగారాల ఏర్పాటుతో 70 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి జరుగుతోందని వెల్లడించారు. నానో యూరియా టెక్నాలజీ రైతులకు అందుబాటులోకి తెచ్చామన్నారు మోదీ. బీజేపీ అధికారంలోకి వచ్చాక యూరియా కొరత లేకుండా చేశామన్నారు. భవిష్యత్‌లో భారత్‌ యూరియా పేరిట ఒకటే బ్రాండ్‌ తెస్తామన్నారు.


సింగరేణి ప్రైవేటీకరణపై క్లారిటీ
సింగరేణిని ప్రైవేటు పరం చేస్తున్నామని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మోదీ మండిపడ్డారు. సింగరేణిలో 51శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదేనని వెల్లడించారు. మెజార్టీ వాటా రాష్ట్రానిదే అయితే కేంద్రం ఎలా విక్రయిస్తుందని ప్రధాని ప్రశ్నించారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు.

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×