
Jr Ntr Payal Ghosh:తమన్నా ఫ్రెండ్‌గా ఊసరవెల్లిలో నటించిన నటి పాయల్ ఘోష్. ఆ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించారు. అందులో పాయల్ ఘోష్‌తోనూ ఆయనకు కొన్ని సన్నివేశాలున్నాయి. వాటిని గుర్తుచేసుకుంటూ ఎన్టీఆర్ వరల్డ్ ఫేమస్ అవుతారని అప్పట్లో చెప్పారు పాయల్. అయితే అప్పుడు తన మాటలను అందరూ ఆషామాషీగా తీసుకున్నారని ఇప్పుడు ఆయన సినిమా ఆస్కార్ రేసులో ఉందని అన్నారు పాయల్ ఘోష్. ఆస్కార్ రేసులో ట్రిపుల్ ఆర్ నుంచి నాటు నాటు పాట ఒరిజినల్ స్కోర్ కింద ఉన్న విషయం తెలిసిందే. ఎం.ఎం.కీరవాణి స్వరపరచిన పాట అది. ఆ పాట ఆస్కార్ షార్ట్ లిస్టులో ఉండటం గురించి పాయల్ స్పందిస్తూ, మరోసారి ఎన్టీఆర్‌ని పొగిడారు.
తారక్ ఇంకా ఎత్తుకు ఎదుగుతారు. వరల్డ్ ఫేమస్ అవుతారు. ఆయన్ని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా నేను ఈ మాటలను చెబుతున్నా అని అన్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత కొరటాల సినిమా చేయాల్సి ఉంది తారక్. అయితే ఆ సినిమా స్క్రిప్ట్ మారడంతో సెట్స్ మీదకు వెళ్లడానికి లేట్ అవుతోంది. కొత్త సంవత్సరంలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. మహేష్ ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాకు నాన్‌స్టాప్‌గా 60 రోజులు కాల్షీట్ ఇచ్చినట్టే, కొరటాల మూవీకి కూడా తారక్ నాన్‌స్టాప్‌గా రెండు నెలలు కాల్షీట్ ఇచ్చేస్తారనే మాటలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే వచ్చే ఏడాది దసరాకు తారక్ సినిమా విడుదలవుతుంది. ప్యాన్ ఇండియా రేంజ్‌లో తారక్‌కి వచ్చిన పేరుకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా స్క్రిప్ట్ సిద్ధం చేశారట కొరటాల. ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ చరిష్మాను చూసి, స్క్రిప్ట్ ని చేంజ్ చేశారు కొరటాల.