BigTV English

Heat Stroke : హీట్‌స్ట్రోక్ అంటే ఏమిటి.. దీని వల్ల ప్రాణాలు పోతాయా?

Heat Stroke : హీట్‌స్ట్రోక్ అంటే ఏమిటి.. దీని వల్ల ప్రాణాలు పోతాయా?
Heat Stroke
Heat Stroke

Heat Stroke : వేసవి కాలం మొదలైంది. ఎండలు మండుతున్నాయి. దీంతో హీట్ స్ట్రోక్ (వడదెబ్బ), డీహైడ్రేషన్ ప్రమాదం పెరుగుతుంది. హీట్‌స్రోక్ కారణంగా శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతుంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. ఈ స్థితిలో శరీరం తన ఉష్ణోగ్రతను నియంత్రించలేకపోతుంది. చెమట విపరీతంగా పడుతుంది.  శరీరం స్వయంగా చల్ల బడలేదు. హీట్ స్ట్రోక్ సంభవించినప్పుడు శరీర ఉష్ణోగ్రత కొన్ని నిమిషాల్లో 106°F కంటే ఎక్కువగా ఉంటుంది.


దీని కారణంగా మెదడు, ఇతర శరీర భాగాలకు నష్టం కలగవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. భారత వాతావరణ శాఖ (IMD) కూడా ఈ సంవత్సరం తీవ్రమైన వేడి గురించి హెచ్చరిక జారీ చేసింది. దీని ప్రకారం ఈ సంవత్సరం ఏప్రిల్, జూన్ మధ్య వేడి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అందువల్ల హీట్ స్ట్రోక్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా ముఖ్యం.

Also Read : అవకాడో అద్భుతాలు.. తెలిస్తే వావ్ అనాల్సిందే!


పిల్లలు, వృద్ధులు, రోజులో ఎక్కువ సమయం ఎండలో గడపాల్సిన వారికి హీట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. దీనిని నివారించడానికి ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలను చేర్చడం చాలా ముఖ్యం. ఇవి ఎక్కువ మొత్తంలో నీటిని కలిగి ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.

దోసకాయ

దోసకాయ వేసవిలో సూపర్ ఫుడ్. ఇది చాలా నీటిని కలిగి ఉంటుంది. ఇది శరీరంలో నీటి కొరతను కలిగించదు.  డీహైడ్రేషన్ సమస్యను నివారిస్తుంది. అందువల్ల మీ ఆహారంలో దోసకాయను చేర్చండి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సూర్యకాంతి నుండి చర్మాన్ని రక్షించడంలో కూడా సహాయపడతాయి. మీరు బయటకు వెళుతున్నప్పటికీ మీరు వేయించిన ఆహారానికి బదులుగా దోసకాయ తినవచ్చు. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.

పుచ్చకాయ

పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది వేసవిలో శరీరానికి ఉపయోగంగా ఉంటుంది. విటమిన్ ఎ, విటమిన్ సి కూడా ఇందులో ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సూర్యరశ్మి నుంచి రక్షణ కల్పిస్తాయి. అందుకే వేసవిలో పుచ్చకాయను ఆహారంలో భాగం చేసుకోండి.

కివి

కివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరంలోని ఎలక్ట్రోలైట్స్‌ని బ్యాలెన్స్ చేయడంలో ఇది చాలా సహాయపడుతుంది. వేసవిలో ఎక్కువ చెమట పట్టడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్‌లో అసమతుల్యత ఏర్పడి బీపీకి సంబంధించిన సమస్యలు రావచ్చు. అందువల్ల కివిని మీ ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

టమాటో

టమాటో చాలా జ్యుసిగా ఉంటుంది. దీనికి కారణం అందులో ఉండే నీరు. నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల వేసవిలో శరీరానికి ఇది చాలా మేలు చేస్తుంది. విటమిన్ ఎ, లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఇందులో ఉన్నాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Also Read : రోజూ ఉదయం ఇడ్లీ, దోశ తినవచ్చా..?

కొబ్బరి నీరు

వేసవి కాలంలో మిమ్మల్ని మీరు హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి, ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యంగా ఉంచుకోవడానికి కొబ్బరి నీళ్లు తాగడం చాలా ముఖ్యం. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.  హీట్ స్ట్రోక్‌ను నివారించడంలో సహాయపడుతుంది. కాబట్టి సోడా, శీతల పానీయాలకు బదులు కొబ్బరి నీళ్లు తాగాలి.

Disclaimer : ఈ కథనాన్ని పలు మెడికల్ జర్నల్స్‌‌లోని సమచారం ఆధారంగా, నిపుణుల సలహా మేరకు అందిస్తున్నాం. దీనిని కేవలం అవగాహనగా మాత్రమే భావించండి.

Tags

Related News

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×