BigTV English

JrNTR : నెక్ట్స్ సినిమాను ఆపేస్తా.. NTR 30పై ఎన్టీఆర్ ఓపెన్ కామెంట్స్‌

JrNTR : నెక్ట్స్ సినిమాను ఆపేస్తా.. NTR 30పై ఎన్టీఆర్ ఓపెన్ కామెంట్స్‌

JrNTR: ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ కోసం ఆస‌క్తిగా వెయిట్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ వ‌చ్చి సంవ‌త్స‌రం దాటేసింది. ఇంకా ఎన్టీఆర్ త‌న 30వ సినిమా షూటింగ్‌నే స్టార్ట్ చేయ‌లేదు. అందుకు కార‌ణం.. RRR వచ్చి ఏడాది దాటేసింది. ఈ నేప‌థ్యంలో తార‌క్ దాస్ కా ద‌మ్కీ ఈవెంట్‌కు గెస్ట్‌గా హాజ‌ర‌య్యారు. అప్పుడు ఓ అభిమాని నెక్ట్స్ సినిమా ఎప్పుడో చెప్పాలంటూ గ‌ట్టిగా అరిచాడు. దానికి తార‌క్ కూడా అదే స్టైల్‌లో రియాక్ట్ అయ్యారు. ‘నేను నెక్ట్స్ మూవీ చేయ‌టం లేదు. ఎన్నిసార్లు చెప్పాలి. ఇప్ప‌టికే చెప్పాను క‌దా. ఇలా అడిగితే నెక్ట్స్ మూవీ చేయ‌లేద‌నే చెప్తాను. ఆపేస్తాను కూడా’ అని అన్నారాయన. తర్వాత నవ్వుతూ నేను అలా ఆపను. అలా ఆపితే మీరు ఊరుకుంటారా! అని అన్నారు.


NTR 30 సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. జ‌న‌తా గ్యారేజ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ఎన్టీఆర్, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది. మార్చి 23న సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంద‌ని అంటున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా జ‌త క‌ట్ట‌నుంది. విల‌న్‌గా సైఫ్ ఆలీఖాన్ న‌టించ‌బోతున్నారు. బాలీవుడ్ మార్కెట్‌ను టార్గెట్ చేయ‌టం వ‌ల్ల‌నే ఇద్ద‌రు బాలీవుడ్ స్టార్స్‌ను తీసుకున్న‌ట్లు సినీ స‌ర్కిల్స్ టాక్‌.

సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదు కానీ.. రిలీజ్ డేట్‌ను ఎప్పుడో అనౌన్స్ చేసేశారు. 2024 ఏప్రిల్ 5న ఎన్టీఆర్ 30న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఇప్ప‌టికే మేక‌ర్స్ చెప్పేశారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌రికృష్ణ‌, సుధాక‌ర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ 30ని స్టార్ట్ చేయటానికి తారక్ చాలా సమయాన్నే తీసుకున్నారు. అందుకు కారణం.. ఆయన తన నెక్ట్స్ సినిమాలపై ఉన్న అంచనాలు ఊహించటమే. పక్కా స్క్రిప్ట్ కుదిరిన తర్వాత సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నారు యంగ్ టైగర్.


Srinidhi Shetty: యశ్ జెంటిల్‌మెన్.. అలాంటోడు కాదు.. రూమర్స్‌పై శ్రీనిధి క్లారిటీ

Naga Chaitanya: లగ్జరీ ఇంటిని నిర్మించుకున్న నాగచైతన్య.. పదిరోజులుగా ఆ ఇంట్లోనే..

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×