BigTV English

July Movies: మేకర్స్ డైలమా.. ఫ్యాన్స్ కన్ఫ్యూజన్..!

July Movies: మేకర్స్ డైలమా.. ఫ్యాన్స్ కన్ఫ్యూజన్..!

July Movies: టాలీవుడ్ ఇండస్ట్రీలో సమ్మర్ లో కొత్త సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. సంక్రాంతి తర్వాత సమ్మర్ లో రిలీజ్ అవుతున్న సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది మార్చిలో ఎక్కువగా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవ్వలేదు. జూన్, జూలైలో స్టార్ హీరోల మూవీస్ పోటీ పడుతున్నాయి. ఇప్పుడు రావాల్సిన క్రేజీ ప్రాజెక్టులు అన్నీ కూడా సినీ లవర్స్‌ను డైలామాలో పడేస్తున్నాయి. సిట్యూవేషన్స్ చూస్తుంటే.. అసలు అనుకున్న టైమ్‌కు వస్తాయా రావా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.. అసలు ఏ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందో ఒక్కసారి తెలుసుకుందాం..


డేట్స్ కోసం మేకర్స్ వెయిటింగ్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు. ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. అయితే జూన్ 12న రిలీజ్ అవుతుందని అనుకున్నారు. కానీ సీజీ వర్క్ ఇంకా పెండింగ్‌లో ఉండడంతో మళ్లీ పోస్ట్‌పోన్ అయ్యింది. ట్రైలర్ విడుదల చేసి, కొత్త డేట్ అనౌన్స్ చేస్తాం అంటూ మేకర్స్ పోస్ట్‌పోన్ చేశారు.. అయితే ఇప్పుడు జూలై 4 న రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఓ వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ షూటింగ్ ను పూర్తి చేశాడు. మేకర్స్ క్లారిటీ ఇచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..


ఇక జూన్ 20న ‘కుబేర’, జూన్ 27న ‘కన్నప్ప’ లాంటి భారీ పాన్-ఇండియా సినిమాలు రిలీజ్ కోసం రెడీగా ఉన్నాయి. ఇక జూలై 4న విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘కింగ్‌డమ్’ సినిమా రాబోతోంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. ఈ మూవీ కూడా విడుదలకు సిద్ధం అవుతుంది. ఇవన్నీ సినిమాలు ఒకదాని వెంటనే మరొకటి రిలీజ్ కాబోతున్నాయి. కలెక్షన్స్ పై ప్రభావం చూపే అవకాశాలు కూడా ఉన్నాయి..

సినిమా షూటింగ్ అప్డేట్స్.. 

జూన్ లో రిలీజ్ కాబోతున్న సినిమాలు ముందుగా డేట్స్ ను లాక్ చేసుకున్నాయి.. అయితే షూటింగ్ పనులు పెండింగ్ ఉండటంతో రిలీజ్ డేట్ మారే అవకాశాలు ఉన్నాయి. హరి హర వీరమల్లు డేట్ ను ఫిక్స్ చేసుకుంటే మేము డేట్ ను తప్పకుండా మార్చుకుంటామని చాలా నాగ వంశీ అన్నారు. వీరమల్లు వస్తే మేము వెనక్కి తగ్గుతామని అన్నారు. ఒకవేళ ‘కింగ్‌డమ్’ కూడా వాయిదా పడితే.. నితిన్ నటిస్తున్న ‘తమ్ముడు’ సినిమా జూలై 4న రిలీజ్‌కి రెడీ అవుతోందని బజ్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్, పోస్ట్-ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తయినట్టు సమాచారం.. ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా డేట్ ను లాక్ చేసుకొని వస్తుందో చూడాలి.. ఏది ఏమైన వీరమల్లు కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. మరి థియేటర్లలో ఎప్పుడు దిగుతుందో చూడాలి.. మళ్లీ కొన్ని సినిమాలు సెప్టెంబర్ లో థియేటర్లలోకి రాబోతున్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×