OTT Movie : ఒక రిచ్ ఫ్యామిలీలో వరుస ఆత్మహత్యలు… కానీ, అవి నిజంగా ఆత్మహత్యలా? లేక వాటి వెనుక రహస్యం ఏదైనా దాగి ఉందా? ఫాదర్ కార్మెన్ బెనెడిక్ట్ అనే క్రైమ్ ఇన్వెస్టిగేటర్ ఈ మిస్టరీని ఛేదించడానికి ముందుకు వస్తాడు. కానీ ఈ కేసు అతన్ని ఒక చిన్న అమ్మాయి వద్దకు తీసుకెళ్తుంది, ఆమె చుట్టూ సూపర్‌నాచురల్ శక్తులు కనిపిస్తాయి. ఈ రహస్యం వెనుక దాగిన సత్యం ఏమిటి? ఫాదర్ బెనెడిక్ట్ ఈ చీకటి శక్తులను ఎదుర్కోగలడా? అనే విషయాలతో పాటు మూవీ డీటైల్స్ ను కూడా తెలుసుకుందాం పదండి.
కథలోకి వెళ్తే…
బెనెడిక్ట్ కు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో మంచి నైపుణ్యం ఉంటుంది. కేరళ పోలీసులకు కష్టతరమైన కేసులలో సహాయం చేస్తుంటాడు. అతన్ని ఆలత్ కుటుంబంలో జరిగిన వరుస ఆత్మహత్యలను దర్యాప్తు చేయడానికి దియా అలెక్స్ (సనియా ఇయ్యప్పన్) అనే యువతి సహాయం కోరుతుంది. ఈ ఆత్మహత్యలు మిస్టీరియస్‌గా కనిపిస్తాయి. బెనెడిక్ట్ వాటిని హత్యలుగా అనుమానిస్తాడు. ఈ దర్యాప్తు అతన్ని అమేయ గాబ్రియేల్ (బేబీ మోనికా) అనే 11 ఏళ్ల అనాథ బాలిక దగ్గరకు చేరుస్తుంది. అమేయ చుట్టూ అతను సూపర్‌నాచురల్ శక్తులు ఉన్నట్టు బెనెడిక్ట్ గుర్తిస్తాడు.
ఆమె “తన సొంతం కాని భారాన్ని మోస్తుంది” అని భావిస్తాడు. అమేయ టీచర్ జెస్సీ (నిఖిలా విమల్), ఆమె ఫియాన్సీ సిద్ధార్థ్ (శ్రీనాథ్ భాసి) ఇప్పుడు కథలోకి ఎంట్రీ ఇస్తారు. జెస్సీ అమేయ వింత ప్రవర్తనను చూసి భయపడుతుంది. బెనెడిక్ట్ అమేయ ప్రవర్తన వెనుక ఒక ఆత్మ ఉందని నమ్మి, ఎక్సార్సిజం చేయడానికి సిద్ధపడతాడు. ఈ ప్రక్రియలో, అమేయకు జెస్సీ అక్క సుసాన్ (మంజు వారియర్) ఆత్మతో సంబంధం ఉందని తెలుస్తుంది.
ఆమె 11 సంవత్సరాల క్రితం ఒక ప్రమాదంలో మరణించింది. సుసాన్ – జెస్సీ గతం, వారి తల్లిదండ్రుల మరణం, సుసాన్ జెస్సీని పెంచిన తీరు ఫ్లాష్‌బ్యాక్‌ల ద్వారా వెల్లడవుతుంది. బెనెడిక్ట్ చేసిన ఇన్వెస్టిగేషన్ లో ఆలత్ కుటుంబ హత్యలు, అమేయ సూపర్‌నాచురల్ సమస్యల మధ్య ఉన్న ఒక లింక్ బయటపడుతుంది. ఆ లింకు ఏంటి? 11 ఏళ్ల క్రితమే మరణించిన సుసాన్ ఎందుకు అమేయను ఎందుకు ఇబ్బంది పెడుతోంది? ఆ రిచ్ ఫ్యామిలీకి దీనికి ఏదైనా సంబంధం ఉందా? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ మలయాళ హర్రర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : 9 ఏళ్ల పిల్లాడి చుట్టూ తిరిగే ఆత్మలు… IMDbలో 8.2 రేటింగ్ తో భయపెడుతున్న హర్రర్ థ్రిల్లర్
ఎక్కడ చూడొచ్చంటే ?
ఈ మలయాళ హర్రర్ మూవీ పేరు ‘The Priest’. 2021లో రిలీజ్ అయిన ఈ మూవీ కేరళలో జరిగే ఒక సూపర్‌నాచురల్ హర్రర్ మిస్టరీ థ్రిల్లర్. ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Videoలో అందుబాటులో ఉంది. ఇందులో మమ్మూట్టి, మంజు వారియర్, నిఖిలా విమల్, బేబీ మోనికా, శ్రీనాథ్ భాసి, సనియా ఇయ్యప్పన్, జగదీష్ తదితరులు నటించారు. జోఫిన్ T. చాకో దర్శకత్వం వహించిన ఈ మూవీలో మమ్ముట్టి ఇంటెన్స్ నటన, బేబీ మోనికా అద్భుతమైన యాక్టింగ్, రాహుల్ రాజ్ చిల్లింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రాన్ని ఒక ఎంగేజింగ్ థ్రిల్లర్‌గా నిలిపాయి. ఈ మూవీని ఇంకా చూడకపోతే వెంటనే హర్రర్ మూవీ లవర్స్ ఓ లుక్కేయండి.