Lion Kiran : హైదరాబాద్ ప్రతి ఏడాది సరి కొత్త థీమ్ లతో ఫ్యాషన్ షోలు ఎక్కువగా జరుగుతున్నాయన్న విషయం తెలిసిందే.. తాజాగా మరో కొత్త ఈవెంట్ ను నిర్వహించారు. కె పార్టీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పార్టీ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. వాళ్ల కోసం తన కొత్త ఆలోచన తో లయన్ డాక్టర్ కిరణ్, సుచిరిండియా గ్రూప్ సీఈఓ మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు బల్గేరియా గౌరవ కన్సల్, తన ప్రతిష్టాత్మక కె పార్టీని రాయల్ బ్రిటిష్ స్టైల్లో ఘనంగా ఆదివారం రాత్రి నగరంలో నిర్వహించారు. ఈ అద్భుత వేడుక, ఫ్యాషన్ షో తో పాటు అందమైన వాతావరణంతో కూడిన వినోదానికి అందించారు. ఈ కార్యక్రమంలో సినిమా ప్రముఖులు, వ్యాపారవేత్తలతో పాటుగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు..
డాక్టర్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఈయన పేరు చాలామందికి తెలిసిందే.. కళా రంగం పై మక్కువతో ఎన్నో రకాలు ప్రోగ్రాంలను నిర్వహిస్తూ ప్రజల ఆధారాభిమానాలను పొందారు. ఆయన ఆలోచనా తీరు ప్రశంసనీయం అనే విషయాన్ని మరోసారి నిరూపించారు. చాలా వినూత్నమగా ఆలోచించి సరికొత్త థీమ్ మరియు సర్‌ప్రైజ్‌లు ఈ ఈవెంట్‌ను మరిచిపోలేని ఓ గొప్ప అనుభవంగా మార్చాయని సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి అతని వినూత్న ఆలోచనతో కొత్త థిమ్ ను క్రియేట్ చేశారు. అందరికి సర్ ప్రైజ్ లు ఇస్తూ ఈ ఈవెంట్‌ను మరిచిపోలేని ఓ గొప్ప అనుభవంగా మార్చాయి..
కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కె పార్టీ, మరోసారి హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా నిలిచింది, వచ్చే సంవత్సరం కె పార్టీ మరో ఎడిషన్ కోసం ఆసక్తి ఇప్పటికే మొదలైంది. తన సృజనాత్మకత మరియు వినూత్నతకు ప్రసిద్ధుడైన లయన్ కిరణ్, మరొక విశిష్టమైన, ఉత్సాహభరితమైన థీమ్‌తో తన ఆహ్వానితులను ఆకట్టుకోవడంలో ఎపుడు కొత్త గా ఉంటుంది. ఇకపోతే వచ్చే సంవత్సరంలో లయన్ కిరణ్ తన విశిష్టమైన పార్టీ ప్రియుల కోసం మరో వినూత్న ఆలోచనలు తీసుకువస్తారో అని తెలుసుకోవాలనే ఆసక్తి కనబరుస్తున్నారు.