Ka KA Movie Collections: తెలుగు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కు ఇప్పటివరకు సరైన హిట్ సినిమా పడలేదు.. దీంతో కొంతకాలం గ్యాప్ తీసుకున్న తర్వాత సరికొత్త కథతో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు.. ఈ హీరో ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘క ‘.. ఇటీవలే దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా మొదట యావరేజ్ టాక్ ను అందుకున్నా కూడా తర్వాత రోజు నుంచి ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి. దాంతో సినిమాకు పాజిటివ్ టాక్ రావడమే కాదు కలెక్షన్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. సినిమా విడుదలైన వారం రోజుల వరకు మంచి టాక్ తో పాటుగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. 50 కోట్ల క్లబ్ లోకి చేరుతుంది అనుకొనేలోపు కలెక్షన్స్ భారీగా పడిపోయినట్లు తెలుస్తుంది. మొన్న వరకు బాగానే ఉన్న కలెక్షన్స్ నిన్న దారుణంగా పడిపోయాయాని తెలుస్తుంది. ఎంత కలెక్షన్స్ ను ఏడో రోజు రాబట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం..
కిరణ్ అబ్బవరం సినీ కేరీర్ సరిగ్గా లేని టైమ్ లో క మూవీ కమ్ బ్యాక్ ఇచ్చింది. దీపావళీ సందర్భంగా విడుదలైన మూవీ అమరన్, బగీరా, లక్కీ బాస్కర్ వంటి సినిమాలతో పాటు సింఘం ఎగైన్, భూల్ భూలయ్యా 2 వంటి హిందీ సినిమాలతో గట్టిపోటీని ఎదుర్కుంటుంది. అయినా ఈ సినిమాల నుంచి పోటీని తట్టుకుంటూనే భారీ విజయాన్ని అందుకుంది. బాగానే వసూల్ చేసింది. కానీ అప్పుడే డల్ అయిపోయినట్లు తెలుస్తుంది. వీకెండ్ భారీగా పెరిగిన కలెక్షన్స్ వీక్ డేస్ లో పడిపోతాయని తెలిసిందే.. అలాగే ఈ మూవీకి జరిగింది. సోమవారం నుంచి కలెక్షన్స్ డౌన్ అవుతూ వస్తున్నాయి. నిన్న ఈ మూవీకి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయాని తెలుస్తుంది.
కలెక్షన్స్ విషయానికొస్తే.. ‘క’మూవీ తొలిరోజు ఇండియన్ బాక్సాఫీస్ రూ. 3.8 కోట్ల వసూలు చేసింది. ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకుని క మూవీ మొదటి రోజు మొత్తం రూ.6.18 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక రెండో రోజు రూ. 3 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక వీకెండ్ లో క మూవీ కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది. 3వ రోజు కలెక్షన్ భారీగా పెరిగాయి. ఎవరూ ఊహించని విధంగా రూ. 3.75 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే నాలుగో రోజు కూడా కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఆరో రోజు కాస్త తగ్గగా.. ఏడో రోజు ఇంకాస్త తగ్గాయి.. 5వ రోజు 1.60 కోట్లు రాబట్టగా.. ఆరోవ రోజు మంగళవారం నాడు రూ.1.50 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఏడో రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 1.2 కోట్ల వరకు రాబట్టింది.. అంటే ఈ మూవీ ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా కేవలం రూ. 36 కోట్లు రాబట్టింది. మరి ఇలానే కలెక్షన్స్ కొనసాగితే 50 కోట్లు రాబట్టడం కష్టమే.. ఇక నెక్స్ట్ వీక్ కంగువ లాంటి పెద్ద సినిమా రాబోతుంది. చూడాలి కలెక్షన్స్ ఎలా ఉంటాయో..