Inquiry on Tirumala Laddu: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై విచారణ మొదలైందా? సీబీఐ సిట్ రంగంలోకి దిగేసినట్టేనా? కావాలనే టీమ్ సభ్యుల ఎంపిక ఆలస్యం చేస్తున్నారా? ఇలా రకరకాల ప్రశ్నలు శ్రీవారి భక్తులను వెంటాడుతున్నాయి.
తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సీబీఐ ఆధ్వర్యంలో ఆ టీమ్ దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం సీబీఐ సిట్ టీమ్ ఏర్పాటు అయ్యింది. సిట్‌లో సభ్యులుగా సీబీఐ హైదరాబాద్ డైరెక్టర్ వీరేష్‌ప్రభు, విశాఖపట్నం సీబీఐ ఎస్పీ మురళి ఉన్నారు.
ఏపీకి చెందిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో ఒకరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, మరొకరు డీఐజీ గోపీనాథ్ జెట్టి ఉన్నారు. ఆహార భద్రతా సంస్థ నుంచి ఇంకా ఓ సభ్యుడి నియామకం జరగనుంది. దీనిపై రేపోమాపో ఆ సంస్థ నుంచి నిర్ణయం వెలువడనుంది. ఈ ఐదుగురు రంగంలోకి దిగనున్నారు.
జూన్‌లో ఏఆర్ డైయిరీ నాలుగు ట్యాంకుల నెయ్యిని తిరుమలకు సరఫరా చేసింది. వాటిని లడ్డూ తయారీకి ఉపయోగించారు. జులైలో సరఫరా చేసిన నెయ్యి ట్యాంకుల్లో యానిమన్ కొవ్వు ఉందని ఎన్డీడీబీ రిపోర్టు ఇచ్చింది. గతంలో సరఫరా చేసిన నెయ్యిలో జంతువు కొవ్వు కలిసి ఉండవచ్చిని భావించిన టీటీడీ, సంప్రోరక్షణ చర్యలు చేపట్టింది.
ALSO READ: కార్తీకమాసం ఎఫెక్ట్.. తిరుమలకు భారీగా భక్తులు.. దర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?
ఇప్పుడు సిట్ రంగంలోకి దిగింది. రేపో మాపో టీటీడీ అధికారులను కలవనుంది. ఇదిలావుండగా జీఎస్టీ ఆధికారులు పోలీసు బాస్‌కు ఓ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. జూన్, జులైలో ఎనిమిది నెయ్యి ట్యాంకులు తిరుమలకు వచ్చాయి.
నెయ్యిని ఏఆర్ డెయిరీ సప్లై చేయలేదని అధికారుల అంతర్గత విచారణ. యూపీలోని బోలేబాబా డెయిరీ నుంచి నెయ్యి ట్యాంకులు వైష్ణవి డైయిరీ, ఏఆర్ డెయిరీ మీదుగా తిరుమలకు చేరినట్టు రిపోర్టులోని అంతర్గత సారాంశం.
మరో మూడు ట్యాంకులు వైష్ణవి డెయిరీ నుంచి నేరుగా తిరుమలకు వచ్చాయని అంటున్నారు. జూన్‌లో తిరుమలకు వచ్చిన ట్యాంకులపై విచారణ చేపట్టనుంది సీబీఐ సిట్. తొలుత టీటీడీ అధికారులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగనుంది. దాని తర్వాత టెండర్లలో మార్పులు, అప్పటి అధికారులను విచారించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.