Nindu Noorella Saavasam Serial Today Episode : పిల్లలందరూ ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్లి ఒక్క ఫోటో మీతో దిగుతామని రిక్వెస్ట్ చేస్తారు. ఎందుకని ప్రిన్సిపాల్ అడగ్గానే మీరు పెద్ద సెలబ్రిటీ అవుతారు అప్పుడు మీతో ఫోటో దిగే అవకాశం మాకు రాదు కదా? అంటారు. ప్రిన్సిపాల్ ఒప్పుకోకపోవడంతో పిల్లలు అందరూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతారు. దీంతో ప్రిన్సిపాల్ ఓకే అంటుంది. అందరూ కలిసి సెల్ఫీ తీసుకునే టైంలోనే ప్రిన్సిపాల్ తన కారు రామ్మూర్తి చేత క్లీన్ చేయించుకున్న వీడియో ఆమెకే సెండ్ చేస్తాడు ఆనంద్.
సెల్ఫీ తీస్తున్న ప్రిన్సిపాల్ ఒక్క నిమిషం అంటూ మెసెజ్ ఓపెన్ చేసి వీడియో చూసి షాక్ అవుతుంది. ఇది కానీ బయట ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా..? మేడం. స్టేట్ మొత్తం షేక్ అవుతుంది అంటుంది అమ్ము. ఆనంద్ కూడా అన్ని న్యూస్ చానెల్స్ మీ వెనకాల పడతాయి మేడం.. మీరు భయంకరమైన ఫేమస్ అయిపోతారు అంటాడు. అలా చేసింది ఎవరో తెలియదు కానీ మీ మీద చాలా కక్ష్య పెట్టుకుని చేసినట్టు ఉన్నారు మేడం అంటాడు ఆకాష్. దీంతో ప్రిన్సిపాల్ మాత్రం ఇదంతా అబద్దం.. అంతా అబద్దం.. అంటుంది.
అబద్దం అని మీకు తెలుసు మాకు తెలుసు..కానీ జనాలకు ఏం తెలుసు మేడం అంటుంది అమ్ము.. ఇంతలో అంజు మేడం ఈ వీడియో చూస్తుంటే.. వాచ్ మెన్ తో పర్సనల్ పనులు చేయించుకుంటున్న ప్రిన్సిపాల్, అరాచకాలు పెరిగిపోయిన ప్రిన్సిపాల్ అని హెడ్ లైన్స్ మీద హెడ్ లైన్స్ వేసి మిమ్మల్ని భయంకరమైన ఫేమస్ చేస్తారేమో అనిపిస్తుంది మేడం అంటుంది. పిల్లల మాటలకు ప్రిన్సిపాల్ లో భయం మొదలవుతుంది. గజగజ వణికిపోతూ బయటకు గాంభీర్యం నటిస్తూ ఉంటుంది.
మంగళకు ఫోన్ చేసిన మనోహరి మన అనుకున్నట్టుగానే మిస్సమ్మను అమర్ ఇంట్లోంచి వెళ్లగొట్టాడు. దాన్ని తీసుకుని రాథోడ్ ఇంటికి వస్తున్నాడు అని చెప్తుంది. దీంతో మంగళ హ్యాపీగా ఇక మీ చేతికి కోట్ల ఆస్థి రాబోతుందన్నమాట అంటుంది. ముందే చెప్తున్నాను మనోహరి.. మా కష్టం ఉంచుకోకూడదు.. నేను నా తమ్ముడు నీకోసం ఎంత కష్టపడ్డామో.. నష్టపోయావో తెలుసు కదా. అంటుంది. సరే కానీ అది అక్కడికే వస్తుంది. దాన్ని మనసు విరిచేసి మళ్లీ ఇక్కడకు రాకుండా చేయాల్సింది నువ్వే అని చెప్తుంది. ఇంతలో బయట కారు శబ్దం విని వాళ్లే వచ్చినట్టు ఉన్నారు. అంతా నేను చూసుకుంటాను. ఉండు అంటూ ఫోన్ కట్ చేస్తుంది.
బయట కారు ఆపిన రాథోడ్ మిస్సమ్మ మీ ఇల్లు వచ్చింది అని చెప్తాడు. అప్పుడే వచ్చామా.. రాథోడ్ అంటూ నా పుట్టింటికి.. మెట్టినింటికి దూరం చాలా తక్కువే అని నాకు ఇవాళే తెలిసింది అంటూ ఎమోషనల్ అవుతుంది. సరే మిస్సమ్మ లోపలికి వెళదాం పద అని రాథోడ్ లగేజీ తీసుకుని వస్తాడు. ఇద్దరూ లోపలికి వెళ్లగానే మంగళ వెటకారంగా మాట్లాఉతుంది. పర్మినెంట్ గా ఇక్కడే ఉండిపోవడానికి వచ్చావా? అని అడుగుతుంది. మిస్సమ్మ పలకదు. ఏం లేదని రెండు రోజులు ఉండి పోవడానికి వచ్చింది అని రాథోడ్ చెప్తాడు. తీసుకొచ్చిన లగేజీ చూసి అలా అనుకున్నాను అని చెప్తుంది మంగళ. ఇంతలో మా నాన్న ఎక్కడ ఉన్నారు పిన్ని అని మిస్సమ్మ అడగ్గానే ఆయన ఎక్కడికి వెళ్లేది. ఏం చేసేది ఎప్పుడైనా నాకు చెప్పారా..? అంటూ ప్రశ్నిస్తుంది మంగళ.
కంగారు తనకు తెలిసివాళ్లందరికీ ఫోన్ చేస్తుంది ప్రిన్సిపాల్ మీకు ఏదైనా వీడియో వచ్చిందా..? అని అడుగుతుంది. అందరూ ఏ వీడియో రాలేదని చెప్తుంటారు. ఇంతలో రామ్మూర్తి ప్రిన్సిపాల్ రూంలోకి వచ్చి మేడం మీ పని ఏదైనా ఉంటే చెప్పండి చేస్తాను అంటాడు. భయంతో వణికిపోతున్న ప్రిన్నిపాల్ ఏం పని లేదని నువ్వు ఇప్పటి నుంచి నీ డ్యూటీ నువ్వు చూసుకో వేరే ఏ పని చేయోద్దని చెప్తుంది. ప్రిన్సిపాల్ మాటలకు కంగారు పడిన మూర్తి అదేంటి మేడం నేనేదైనా తప్పు చేశానా..? నన్ను జాబ్ లోంచి తీసేశారా…? అని అడుగుతాడు. అలాంటిదేం లేదు. ఇప్పటి నుంచి నువ్వు నీ వాచ్ మెన్ డ్యూటీ మాత్రమే చేసుకో వేరే పనులు చేశావో అప్పుడు నిన్ను జాబ్‌లోంచి తీసేస్తాను అంటుంది. దీంతో బయటకు వెళ్లిన రామ్మూర్తి పిల్లలే ప్రిన్సిపాల్ ను బ్లాక్ మెయిల్ చేశారని నిర్దారించుకుని వెళ్లి అడుగుతాడు. పిల్లలు రామ్మూర్తితో సరిగ్గా మాట్లాడకుండా వెళ్లిపోతారు.
ఇన్నేళ్ల నుంచి ఎంత కష్టపడ్డా కాని పని చిన్న ప్లాన్ తో పూర్తి చేశారా? మేడం అని బాబ్జీ, మనోహరిని అడుగుతాడు. అవునని అలాగే ఇంకో పని ఉందని చెప్తుంది మనోహరి. ఏంటో చెప్పండి మేడం మీరు అమరేంద్ర గారిని పెళ్లి చేసుకుంటే నా లెక్కంతా చిటికెలో సెటిల్ చేస్తారు కదా.. అంటాడు బాబ్జీ. దాన్నైతే ఇంట్లోంచి పంపించేశాను కానీ ఇప్పుడు నేను ఇంట్లోకి కోడలుగా అమర్ లైఫ్ లోకి భార్యగా అడుగుపెట్టాలి.
అది జరగాలంటే అమర్ కు నా మీద బాధ్యత పెరిగి.. తర్వాత ప్రేమ పుట్టాలి. అలా జరగాలంటే నాకు ప్రమాదం ఉందని అది అమర్ వల్లేనని నువ్వు ఫోన్ చేసి బెదిరించాలి అని చెప్తుంది. దీంతో బాబ్జీ అమర్‌కు ఫోన్ చేసి మనోమరిని చంపేయబోతున్నాను అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. బాబ్జీ మాటలకు షాక్ అయిన అమర్ వెంటనే మనోహరికి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నా వెంటనే ఇంటికి రా అని చెప్తాడు. సరే అని మనోహరి చూడు భయ పెట్టగానే బాధ్యత పెరిగింది. ఇప్పుడు ఇంటికి వెళ్లి ఆ బాధ్యతను ప్రేమగా మార్చుకుంటాను అని మనోహరి వెళ్లిపోతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.