BigTV English

Ka Movie Trailer : చీకటి వలయం… గందరగోళం… సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటున్న ట్రైలర్..!

Ka Movie Trailer : చీకటి వలయం… గందరగోళం… సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటున్న ట్రైలర్..!

Ka movie trailer.. రాజావారు రాణిగారు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన రహస్య ఘోరక్ (Rahasya ghorak)తో ఇటీవల ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వివాహం అనంతరం ఆయన విడుదల చేయబోతున్న చిత్రం ‘క ‘. వివాహం తర్వాత భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆకట్టుకోబోతోందని చెప్పవచ్చు.


అక్టోబర్ 31న విడుదల..
సుజీత్ (Sujeeth), సందీప్ (Sandeep ) సంయుక్త దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా.. చింతా వరలక్ష్మి సమర్పణలో.. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాల కృష్ణారెడ్డి నిర్మాణంలో ఈసినిమా రాబోతోంది. తన్వి రామ్ (Thanvi Ram), నయన్ సారిక (Nayan Sarika) ఇందులో హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా భారీ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతోంది. ఇకపోతే నిన్ననే విడుదల చేయాల్సిన ఈ ట్రైలర్ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. అక్టోబర్ 31వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కాంబోతున్నట్లు సమాచారం.

ఆకట్టుకుంటున్న ట్రైలర్..


తాజాగా విడుదలైన ట్రైలర్ విషయానికి వస్తే.. కృష్ణగిరి అనే ఒక ఊళ్లో పోస్ట్ మాన్ గా పని చేస్తుంటాడు అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం). అక్కడ ఒక అమ్మాయి తో ప్రేమలో పడిపోతాడుఅలా ఉత్తరాలు పంచే క్రమంలోనే 1970 వ సంవత్సరంలో ఏప్రిల్ 22న అభిషేక్ అనే పేరుతో వచ్చిన ఉత్తరం అభినవ్ వాసుదేవ్ జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పింది. ఆ ఉత్తరంలో ఏముందో చెప్పమని ఒక ముసుగు వ్యక్తి వాసుదేవ్ ని బెదిరిస్తూ ఉంటాడు. అయితే ఆ ఉత్తరంలో ఏముంది..? వాసుదేవ్ ను ఆ ముసుగు వ్యక్తి ,అతని గ్యాంగ్ ఎందుకు బెదిరిస్తున్నారు..? అసలు ఎవరి అభిషేక్ ? అనే విషయాలతో ఆసక్తికరంగా సాగింది.

ఇక ట్రైలర్ మొదట్లోనే.. భక్త ప్రహ్లాద సినిమా నుంచి పాటను ప్లే చేస్తూ.. రక్తంతో కూడిన మూట చూపిస్తారు. యాక్షన్ సీక్వెన్స్ చూపించారు. ఈ ఊరేంటి విచిత్రంగా ఉంది మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడిపోతుంది అంటూ హీరో ప్రశ్నించగా.. ఆ ఊరు వ్యక్తి మాట్లాడుతూ.. మా ఊరి చుట్టూ ఎత్తైన కొండలు ఉన్నాయి. మధ్యాహ్నం మూడు గంటలయ్యేసరికి సూర్యుడి నీడ ఇటువైపుకి రాకుండా కొండలు అడ్డుపడతాయి. అందుకే మధ్యాహ్నం మూడు గంటలకే చీకటి వస్తుంది. మొదట్లో లవ్ రొమాంటిక్ గా చూపించి , ఆ తర్వాత సస్పెన్స్ కి గురి చేశారు మొత్తానికైతే ఈ ట్రైలర్ చాలా బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాంది. ఏది ఏమైనా కిరణ్ అబ్బవరం కి పెళ్లి తర్వాత కలిసొచ్చేటట్టు కనిపిస్తోంది నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×