BigTV English
Advertisement

TSquare designs: టీ-స్క్వేర్ డిజైన్లు.. పలు మార్పులు, వాటికే ఎక్కువ ఛాన్స్

TSquare designs: టీ-స్క్వేర్ డిజైన్లు.. పలు మార్పులు, వాటికే ఎక్కువ ఛాన్స్

TSquare designs: తెలంగాణ ఐకానిక్ టైమ్స్ స్క్వేర్ ఎంతవరకు వచ్చింది? ఇంతకీ డిజైన్లు ఓకే చేశారా? ఏమైనా మార్పులు జరుగుతున్నాయా? ఇప్పటికే టెండర్ల ప్రకటన విడుదలైందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్ తరహాలో తెలంగాణలో ఐకానిక్ టైమ్స్ స్వ్కేర్ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన డిజైన్లను మంత్రి శ్రీధర్‌బాబు గురువారం పరిశీలించారు. పవర్ పాయింట్ ప్రెజేంటేషన్ల ద్వారా సమీక్షించారు. ఆయా డిజైన్లను పరిశీలించిన మంత్రి, కీలక సూచనలు చేశారు.

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ తరహాలో 24 గంటలు సందర్శకులను ఆకట్టుకునేలా టీ-స్క్వేర్‌ను రూపొందించాలని సూచన చేశారు. ఎలక్ట్రానిక్ డిస్ ప్లేలు, డిజిటల్ ప్రకటనలతో ఆ ప్రాంతమంతా వెలుగులు విరజిమ్మాలన్నది మరో పాయింట్.


వ్యాపారం, వినోదం, పర్యాటకంతో సందర్శకులు ఉల్లాసంగా గడిపేలా సాంస్కృతిక ప్రదర్శనలు, గాయకుల సందడి ఉండాలన్నది మరో కీ పాయింట్. దీనికితోడు 24 గంటలు తెరిచి ఉండేలా యాంఫీ థియేటర్లు, ఓపెన్ రెస్టారెంట్లు, ప్రత్యేక థీమ్‌తో కూడిన షాపింగ్ మాల్స్ ఉండాలన్నారు. ఆధునిక లైటింగ్‌లు ఉండాల్సిందేనని నొక్కి వక్కానించారు.

ALSO READ: బీఆర్ఎస్ పేరు మార్చే యోచన, కేటీఆర్ సంకేతాలు .. మరి కలిసొస్తుందా?

ఈ సమీక్షా సమావేశంలో టీజీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ విష్ణువర్థన్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్‌లతో పలువురు అధికారులు హాజరయ్యారు. వీలైనంత తొందరగా డిజైన్లు రెడీ చేయాలని ఆయా సంస్థలను ఆదేశించారు మంత్రి శ్రీధర్ బాబు.

Related News

Maganti Gopinath Mother: నా కొడుకును చంపింది వాళ్లే.. పోలీస్ స్టేషన్‌కు మాగంటి గోపీనాథ్ తల్లి

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

KTR Resign Posters: కేటీఆర్ రాజీనామా!.. జూబ్లీలో పోస్టర్ల కలకలం

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ.. బిగ్ టీవీ సర్వేలో సంచలన ఫలితాలు

Hydraa AV Ranganath: రూ.55వేల కోట్ల ఆస్తులను కాపాడాం.. సపోర్టుగా నిలిచిన ప్రజలకు థ్యాంక్స్: ఏవీ రంగనాథ్

Hanmakonda News: పొలాల్లోకి 2వేల నాటు కోళ్లు.. ఎగబడ్డ జనాలు.. ఒక్కొక్కరు పదేసి కోళ్లను..?

Big Stories

×