BigTV English

Kaantha : దుల్కర్ సల్మాన్, రానా మల్టీస్టారర్ మూవీ స్టోరీ లీక్… భీమ్లా నాయక్‌ను మించే కథ

Kaantha : దుల్కర్ సల్మాన్, రానా మల్టీస్టారర్ మూవీ స్టోరీ లీక్… భీమ్లా నాయక్‌ను మించే కథ

Kaantha : కంటెంట్ బేస్డ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన మలయాళ హీరో దుర్కర్ సల్మాన్, టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ కాంతా. తాజాగా ఈ సినిమా స్టోరీ లీక్ అయ్యి ఇద్దరు హీరోల అభిమానులకు షాక్ ఇచ్చింది.


కాంత స్టోరీ లీక్…

రానా, దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా పాన్ ఇండియా మూవీ కాంత షూటింగ్ సెప్టెంబర్ 10న మొదలైన విషయం తెలిసిందే. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. పీరియాడిక్ కథాంశంతో రాబోతున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా, సముద్రఖని కీలకపాత్రను పోషిస్తున్నారు. స్పిరిట్ మీడియా, వేఫెరర్ ఫిల్మ్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


ఇక ఈ పాన్ ఇండియా మూవీకి జాను సంగీతం అందిస్తున్నారు. అయితే కాంత మూవీ స్టోరీ 1950 మద్రాస్ నేపథ్యంలో సాగుతుందని, మానవ బంధాలు, సామాజిక మార్పులతో గొప్ప అనుభూతిని పంచేలా సినిమా ఉంటుందని డైరెక్టర్ సెల్వరాజ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైన మొదట్లోనే చెప్పారు. అయితే స్టోరీ లైన్ ఏంటి అన్న విషయం మాత్రం రివీల్ చేయలేదు. తాజాగా ఈ మూవీ స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఆ రూమర్ల సారాంశం ప్రకారం కాంత మూవీ స్టోరీ మొత్తం ఇద్దరు హీరోల మధ్య ఈగో క్లాషెస్ చుట్టూనే సాగుతుందని తెలుస్తోంది. 1950 మద్రాస్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది అంటూ ఇప్పటికే మేకర్స్ వెల్లడించగా, తాజాగా బయటకు వచ్చిన ఈ వార్త అభిమానులలో జోష్ ను మరింత పెంచింది.

Dulquer Salmaan joins hands with Rana Daggubati for multi-lingual film ' Kaantha' | Telugu Movie News - Times of India

భీమ్లా నాయక్ ను మించే స్టోరీ 

ఇక తాజాగా ఈగో క్లాసెష్ మధ్య స్టోరీ సాగుతుంది అంటూ వార్తలు రాగా, ఈ సినిమాకు భీమ్లా నాయక్ మూవీతో పోలిక పెట్టి చూస్తున్నారు నెటిజన్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన భీమ్లా నాయక్ మూవీ స్టోరీ లాగే ఇది కూడా ఉందంటూ పవర్ స్టార్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక రానా అభిమానులు మాత్రం దాన్ని మించిపోయేలా ఈ సినిమా ఉంటుంది అంటూ ఇప్పటి నుంచే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు టాలెంటెడ్ హీరోలు దుల్కర్, రానాలను ఒకే ఫ్రేమ్ లో చూడడం అన్నదే మూవీ లవర్స్ కు మంచి ఫీస్ట్ అనుకుంటే, డైరెక్టర్ ఊహించని స్టోరీ లైన్ తో థియేటర్లను షేక్ ప్లాన్ వేస్తున్నట్టు అన్పిస్తోంది. అయితే మూవీకి కాంత అనే టైటిల్ ఉండడంతో, ఇద్దరు హీరోలు ఒకే హీరోయిన్ గురించి ఫైట్ చేస్తారా అనే కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనేది తెలియదు గానీ తాజా రూమర్ మాత్రం కాంత మూవీపై మరింత ఆసక్తిని పెంచేసింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×