BigTV English

Tollywood: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత ఆత్మహత్య..!

Tollywood: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత ఆత్మహత్య..!

Tollywood:ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు అనూహ్యంగా ఆత్మహత్యలు చేసుకొని తనువు చాలిస్తున్నారు. ఈ విషయం తెలిసి అభిమానులు పూర్తి దిగ్భ్రాంతికి గురి అవుతున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా ‘కబాలి’ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న నిర్మాత కె.పి చౌదరి (KP Choudhary) అలియాస్ కృష్ణ ప్రసాద్ చౌదరి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అసలు విషయంలోకెళితే గత కొన్ని రోజులుగా డ్రగ్స్ వ్యవహారంలో పీకల్లోతు మునిగి విమర్శలు పాలైన కేపీ చౌదరి , గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే అనారోగ్య కారణాలతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. 2016లో సినిమా రంగంలోకి వచ్చిన కేపీ చౌదరి కబాలి సినిమా తెలుగు వర్షన్ కు నిర్మాతగా వ్యవహరించి, అలాగే పలు తెలుగు, తమిళ్ చిత్రాలకు కూడా డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు.


కృష్ణ ప్రసాద్ చౌదరి కెరియర్..

కేపీ.చౌదరి సినిమా రంగ విషయానికి వస్తే.. సర్దార్ గబ్బర్ సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అర్జున్ సురవరం వంటి చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేసిన ఈయనకు పెద్దగా కలిసి రాలేదు. దీంతో సినిమా రంగంలో భారీగా నష్టాలను చవిచూశాడు. అయితే ఆ నష్టాలను పూడ్చడానికి డ్రగ్స్ దందాలోకి దిగినట్లు సమాచారం.


డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న కృష్ణ ప్రసాద్ చౌదరి..

సినిమా ఇండస్ట్రీలో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి డ్రగ్స్ దందాలోకి దిగారు కృష్ణ ప్రసాద్ చౌదరి. అందులో భాగంగానే గోవాలో ఓహెచ్ఎం పబ్ ని మొదలుపెట్టారు. గోవాకు వచ్చిన సెలబ్రిటీలకు రహస్యంగా డ్రగ్స్ సరఫరా చేసేవారు. ముఖ్యంగా టాలీవుడ్ సెలబ్రిటీలలో చాలామందితో సన్నిహిత్యం పెంచుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ పబ్ బిజినెస్ లో కూడా నష్టాలు రావడంతో తిరిగి హైదరాబాదుకి చేరుకున్నాడు కేపీ చౌదరి. ముఖ్యంగా పలువురు సినీ తారలతో సంబంధాలు ఉన్నాయని, అప్పట్లోనే ఆయన పేరు బాగా మారుమ్రోగిపోయింది. సెలబ్రిటీలతో హగ్గులు, ముద్దులు, లేడీ యాక్టర్స్ తో ఆయన సన్నిహితంగా ఉండే ఫోటోలు బయటకు రావడంతో మరింత చర్చనీయాంశంగా మారింది.ఇక తర్వాత గోవా నుంచి వస్తూ 100 ప్యాకెట్ల కొకైన్ తీసుకు వచ్చాడు. ఆ సమయంలో సైబరాబాద్ పోలీసులు రూ.78.5 లక్షల విలువైన డ్రగ్స్ ను విక్రయిస్తున్నందుకు ఆయనను అరెస్టు చేశారు. ఆయన వద్ద నుంచి 82.75 గ్రాముల కొకైన్ ఉన్న 90 శాచెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ .2,05,000 విలువైన నగదు, 4 మొబైల్ ఫోన్ లు, ఒక కార్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్టెన్సెస్ చట్టం కింద 1985లోని సంబంధిత విభాగాల కింద కేసు నమోదు చేయడం జరిగింది. అలా పోలీసుల చేతికి చిక్కడంతో సెలబ్రిటీలు ఈయనపై కూడా పలు కామెంట్లు చేశారు. తమకు కేపీ చౌదరి ఒక పబ్ ఓనర్ గా మాత్రమే తెలుసునని, ఆయన చేసే డ్రగ్స్ దందాతో తమకు ఎటువంటి సంబంధం లేదని కూడా అప్పట్లో చెప్పుకొచ్చారు. ఇక అప్పుల్లో కూరుకుపోయిన కేపీ చౌదరి అనారోగ్య సమస్యలకు గురి అయ్యారని ఆ కారణంగానే ఆయన మరణించారని కుటుంబ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు. ఇక ముఖ్యంగా ఇవాళ ఉదయం పోలీసులు వెళ్లేసరికి ఆయన విగత జీవిగా పడి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×