Kajal Aggarwal’s ‘Satyabhama’ Movie Releasing on May 27th: చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ చిన్నది స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకుంది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను వివాహమాడి.. ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యింది. ఇక బిడ్డ పుట్టాకా అమ్మడు సినిమాలకు దూరం అవుతుంది అనుకున్నారు కానీ, రీఎంట్రీలో కూడా అదరగొట్టేసింది.
వీరసింహారెడ్డి సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన కాజల్.. తెలుగు, తమిళ్ అని తేడాలేకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను చేస్తూ బిజీగా మారింది. ఇకపోతే కాజల్ నటించిన తాజా చిత్రం సత్యభామ. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దర్శకుడు శశికిరణ్ తిక్క నిర్మించడం విశేషం. ఇక ఈ చిత్రంలో కాజల్ తోపాటు యువహీరో నవీన్ చంద్ర కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచేసాయి. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కాజల్ కనిపించనుంది.
Also Read: Pawan Kalyan: ‘ఎక్స్’ ను షేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్.. ఇదెక్కడి మాస్ రా మావా
తాజాగా సత్యభామ రిలీజ్ డేట్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. వేసవి కానుకగా మే 17 న ఈ సినిమా థియేటర్ లో విడుడల కానుందని తెలిపారు. ఇక ఈ కొత్త పోస్టర్ తో పాటు కాజల్ కు కొత్త బిరుదును అందచేశారు మేకర్స్. క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్ అంటూ రాసుకొచ్చారు. హీరోల్లో కింగ్ ఆఫ్ మాసెస్ బిరుదు బాలకృష్ణకు ఉంది. ఇప్పుడు క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అందుకుంది. మరి ఈ బిరుదు తరువాత అమ్మడి రాత ఎలా అంటుందో చూడాలి.
'The Queen of Masses' @MSKajalAggarwal #Satyabhama in theatres worldwide on May 17th
▶️ https://t.co/qTz6Gy1wYe pic.twitter.com/Z1GBIj5Oo7
— Vamsi Kaka (@vamsikaka) April 22, 2024