BigTV English

Kajal – Satyabhama: ఇవాళ 6 గంటలకు కాజల్‌తో కలిసి ‘సత్యభామ’ సినిమా చూసే అవకాశం.. ఇలా చేయండి..

Kajal – Satyabhama: ఇవాళ 6 గంటలకు కాజల్‌తో కలిసి ‘సత్యభామ’ సినిమా చూసే అవకాశం.. ఇలా చేయండి..

Satyabhama Special Premiere: అందాల ముద్దుగుమ్మ కాజల్ ఎంతో మంది సీనియర్, యంగ్ స్టార్ హీరోలతో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఒకప్పుడు వరుస సినిమాలతో కాస్త తీరిక లేకుండా బిజీ బిజీగా ఉండేది. పవన్ కల్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, రవితేజ, అల్లు అర్జున్ వంటి స్టార్ అండ్ సీనియర్ హీరోల సరసన నటించి తన అందం, యాక్టింగ్‌తో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది.


ఇక తన కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో తన చిన్న నాటి స్నేహితుడిని మ్యారేజ్‌ చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. ఇక ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే గతేడాది బాలయ్యబాబుతో ‘భగవంత్ కేసరి’ మూవీలో నటించి అదరగొట్టేసింది. అయితే ఒకప్పుడు గ్లామరస్ పాత్రలతో సినీ ప్రియుల్ని ఊర్రూతలూగించిన కాజల్.. ఇప్పుడు మాత్రం మంచి సబ్జెక్ట్ ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటోంది.

ఇప్పుడు మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘సత్యభామ’ అనే లేడీ ఓరియేంటెడ్ మూవీతో సినీ ప్రియుల్ని అలరించబోతోంది. ఈ సినిమా జూన్ 7న అంటే రేపు కాక ఎల్లుండి రిలీజ్ కాబోతోంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటించబోతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలు పెంచేశాయి.


Also Read: కాజల్ నటవిశ్వరూపం.. సత్యభామ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ చూశారా..?

ఇక తాజాగా ఈ మూవీ కోసం చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూవీని మరింతగా ఆడియన్స్‌లోకి తీసుకెళ్లేందుకు వినూత్న ప్రయత్నం మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే స్పెషల్ ప్రీమియర్‌ను వేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రీమియర్‌లో కాజల్‌తో కలిసి సినిమా చూసే అవకాశాన్ని కల్పించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

జూన్ 5వ తేదీ అంటే ఇవాళ సాయంత్రం 6 గంటలకు హైదారబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో ‘సత్యభామ’ స్పెషల్ ప్రీమియర్‌ను ప్రదర్శించనున్నారు. అయితే ఈ ప్రీమియర్ టికెట్లను పొందడానికి ప్లే స్టోర్ నుంచి ‘షీ సేఫ్’ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని.. దాన్ని టికెట్ కౌంటర్‌లో చూపిస్తే టికెట్స్ ఇస్తారు. దీంతో ఈ స్పెషల్ ప్రీమియర్‌ను కాజల్‌తో కలిసి చూసే అవకాశాన్ని మూవీ యూనిట్ కల్పించింది. దీనిబట్టి చూస్తే ‘సత్యభామ’ మూవీ కోసం కాజల్‌తో పాటు మూవీ టీం ఎంతలా కష్టపడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ కానీ మంచి హిట్ అయితే.. కాజల్ మళ్లీ తన ఫామ్ కొనసాగిస్తుందనే చెప్పాలి.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×