BigTV English

Satyabhama Trailer: కాజల్ నటవిశ్వరూపం.. సత్యభామ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ చూశారా..?

Satyabhama Trailer:  కాజల్ నటవిశ్వరూపం.. సత్యభామ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ చూశారా..?

Satyabhama Trailer: చందమామ కాజల్ అగర్వాల్ టైటిల్ పాత్రలో నటిస్తన్న చిత్రం సత్యభామ. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి.. డైరెక్టర్ శశికిరణ్ తిక్కా స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా సినిమాను సమర్పిస్తున్నాడు. ఇక ఇందులో నవీన్ చంద్ర.. కాజల్ భర్తగా కీలక పాత్రలో కనిపిస్తుండగా.. ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


తాజాగా ఈ సినిమా ట్రైలర్ నందమూరి బాలకృష్ణ రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. సత్యభామ చిత్రంలో కాజల్ పవర్ ఫుల్ పోలీసాఫీర్ పాత్రలో కనిపిస్తుంది. ట్రైలర్ మొత్తాన్ని యాక్షన్ సీక్వెన్స్ తోనింపేశారు. సత్యభామ ఒక ACP. ఒక అమ్మాయి కేసులో ఆమె దోషిగా నిలబడుతుంది. దగ్గర ఉన్నా కూడా ఆమెను కాపాడలేకపోయాయనే అనే బాధ, హంతకుడును పట్టుకోలేకపోయానే అనే కోపం .. ఆమె మనసును తొలిచేస్తూ ఉంటాయి. ఎవరు ఎన్ని చెప్పినా సత్య ఆ కేసును క్లోజ్ చేసిన తరువాతే తాను ప్రశాంతంగా ఉంటానని ఛాలెంజ్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెడుతుంది.

ఇక ఆ ఇన్వెస్టిగేషన్ లో సత్యకు ఎదురైన సమస్యలు ఏంటి.. ? చివరికి హంతకుడును పట్టుకోగలిగిందా.. ? అమ్మాయిలను చంపుతున్న వ్యక్తి ఎవరు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. కాజల్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తుందని మొదట అనౌన్స్ చేసినప్పటినుంచే సినిమాపై ఒక హైప్ వచ్చింది. ఇక ఈ ట్రైలర్ తో ఆ హైప్ మరింత పెరిగింది. ACP సత్యభామగా కాజల్ నట విశ్వరూపం చూపించింది. శ్రీచరణ్ పాకాల సంగీతం మరో హైలైట్ గా నిలిచింది. జూన్ 7 న సత్యభామ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో కాజల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Related News

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Big Stories

×