BigTV English

Kalki 2898 AD Sequel : “కల్కి 2″పై క్రేజీ లీక్ ఇచ్చిన పొలిశెట్టి… అఫిషియల్ కన్ఫర్మేషన్ ఒక్కటే బ్యాలన్స్

Kalki 2898 AD Sequel : “కల్కి 2″పై క్రేజీ లీక్ ఇచ్చిన పొలిశెట్టి… అఫిషియల్ కన్ఫర్మేషన్ ఒక్కటే బ్యాలన్స్

Kalki 2898 AD Sequel : దేశ మొత్తం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన ప్రభాస్ మూవీస్ లో ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) కూడా ఒకటి. ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) తో పాటు చాలామంది ప్రముఖ నటీనటులు కీలకపాత్రలు పోషించారు. ఇక సెకండ్ పార్ట్ లో మరికొంత మంది యంగ్ హీరోలు పాలు పంచుకోబోతున్నారని విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా నవీన్ పోలిశెట్టి ఓ క్రేజీ లీక్ ఇచ్చారు.


నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా దీపిక పదుకొనే, దిశా పటాని హీరోయిన్లుగా నటించిన ‘కల్కి’  (Kalki 2898 AD) ప్రేక్షకులను మరో ప్రపంచం లోకి తీసుకెళ్లింది. ఇతిహాసాలను ఎవ్వరూ ఊహించని విధంగా అద్భుతంగా తెరపై చూపించి వేల కోట్ల రికార్డును ప్రభాస్ బ్రేక్ చేసేలా చేశారు నాగ్ అశ్విన్. ఇక ‘కల్కి’ మూవీ రిలీజ్ అయ్యాక ఈ సినిమాలో నటించిన పాత్రల గురించి కథలు కథలుగా చెప్పుకోవడం మనం చూసాం. అయితే కల్కి పార్ట్ 2 (Kalki 2898 AD Part 2) కూడా ఉండబోతుందన్న విషయాన్ని మేకర్స్ ముందుగానే చెప్పేశారు. కానీ ఈ సినిమా తెరపైకి రావడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. అయితే ఇలాంటి టైంలో ‘కల్కి 2’ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే దానికి కారణం నవీన్ పోలిశెట్టి.

‘కల్కి పార్ట్ 2’లో నేచురల్ స్టార్ నానితో పాటు నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) కీలకపాత్రను పోషించబోతున్నారంటూ రూమర్లు వినిపించిన సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ లో చాలామంది క్యామియోలను దింపిన నాగ్ అశ్విన్ సెకండ్ పార్ట్ లో వీరిద్దరిని తీసుకోబోతున్నానని చెప్పేశారు. అయితే తాజాగా నవీన్ పోలిశెట్టి పాత్ర సినిమాలో కన్ఫర్మ్ అయినట్టుగా హింట్ ఇచ్చారు. రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా చాలా మంది సెలబ్రిటీలు ఆయనకు సోషల్ మీడియాలో విషెస్ తెలియజేయగా, నవీన్ పోలిశెట్టి కూడా ఆ లిస్టులో చేరిపోయారు. అయితే బర్త్ డే విషెస్ తో పాటు ఆయన చివరగా ‘లెట్స్ పార్టీ ఇన్ శంభాల’ అంటూ ట్వీట్ చేయడంతో ‘కల్కి పార్ట్ 2’లో నవీన్ పోలిశెట్టి పాత్ర కన్ఫామ్ చేశారు. దీనిపై కేవలం అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం మాత్రమే మిగిలింది. మరి నాని పాత్ర గురించి ఇలాంటి హింట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.


కాగా ‘కల్కి’ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, శోభన, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, విజయ్ దేవరకొండ, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వంటి నటీనటులు, డైరెక్టర్స్ కీలక పాత్రలు పోషించారు. కాగా ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘ది రాజా సాబ్’ పూర్తయ్యాక హను రాఘవపూడి ప్రాజెక్టు, సందీప్ రెడ్డి వ్యంగా ‘స్పిరిట్’ సినిమాలను మొదలు పెట్టబోతున్నారు. ‘కల్కి’ సీక్వెల్ (Kalki 2898 AD Part 2) ను ఈ ఏడాది చివర్లో మొదలు పెట్టబోతున్నారని టాప్ నడుస్తోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×