E-Paper
Advertisement

Kalki 2898 AD Trailer: ‘కల్కి’ ట్రైలర్‌పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Kalki 2898 AD Trailer: ‘కల్కి’ ట్రైలర్‌పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Advertisement

Kalki 2898 AD Trailer: టాలీవుడ్ రెబల్ స్టార్ నటిస్తున్న పాన్ వరల్డ్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపిస్తుండగా..రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్నారు. అయితే సాయంత్రం 7 గంటలకు మేకర్స్ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లో యాక్షన్ సీన్స్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. గూస్ బంప్స్ తెప్పించేలా ట్రైలర్ ఉండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

చాలా సమయం పట్టింది…

Advertisement

‘కల్కి’ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే పోస్టర్స్, గ్లింప్స్, బుజ్జి కారులను రిలీజ్ చేయగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా, ట్రైలర్ విడుదల చేయగా.. ఇందులోని డైలాగ్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అయితే కల్కి ట్రైలర్‌పై ప్రేక్షకులను ఉద్ధేశిస్తూ.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇన్‌స్టాలో ఓ పోస్టు చేశాడు. ‘ఈ రోజు చేరుకునేందుకు చాలా సమయం పట్టింది. అయితే తెలుగు ప్రేక్షకులుగా, భారతీయులుగా, సినిమా ప్రేమికులుగా గర్వించేలా సినిమా ఉంటుందని ఆశిస్తున్నా. మా టీం మొత్తం కల్కి ప్రపంచాన్ని మీతొ పంచుకునేందుకు ఎదురుచూస్తోంది.’ అంటూ డైరెక్టర్ నాగ్ పేర్కొన్నారు. కాగా, ఈ మూవీ కోసం డైరెక్టర్ నాగ్ అశ్విన్ మరో ప్రపంచాన్ని సృష్టించినట్లు అర్థమవుతోంది.

Also Read: సౌందర్య లహరి.. స్వప్న సుందరి.. ఇప్పుడు ఎంత హాట్ గా ఉందో చూశారా..?

Advertisement

‘కల్కి’ సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. అయితే డైరెక్టర్ గతంలోనూ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాను చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చే సమయంలో ప్రేక్షకులు కొంతసేపటి వరకు వింతగా భావిస్తారని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యలు చేశారు. నేను ఎక్కడ ఉన్నాను.? నేను ఈ ప్రపంచంలోకి తిరిగి వెళ్లవచ్చా? అని ఆలోచిస్తారని వ్యాఖ్యలు చేశారు. అలాగే జేమ్స్ కామెరూన్ తీసిన అవతార్ మూవీ కూడా చూసినట్లు ఇలాగే ఫీల్ అయినట్లు గతంలో నాగ్ అశ్విన్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×