BigTV English

Deepti Bhatnagar: సౌందర్య లహరి.. స్వప్న సుందరి.. ఇప్పుడు ఎంత హాట్ గా ఉందో చూశారా..?

Deepti Bhatnagar: సౌందర్య లహరి.. స్వప్న సుందరి.. ఇప్పుడు ఎంత హాట్ గా ఉందో చూశారా..?

Deepti Bhatnagar: సౌందర్య లహరి.. స్వప్న సుందరి.. నువ్వే నామాధురీ అంటూ వచ్చే సాంగ్ గుర్తుందా.. ? గుర్తులేదు అంటే మీరు కచ్చితంగా 90s కిడ్స్ కాదని అర్ధం. అప్పట్లో కుర్రాళ్ళు.. ఈ బొడ్డు సుందరిని చూడడానికి థియేటర్ కు క్యూ కట్టేవారు. కుర్రాళ్ల కలలరాణిగా ఆమె అప్పట్లో చేసిన రచ్చ అంతా ఇంతాకాదు. ఆమె ఎవరో ఈపాటికే తెలిసిపోయి ఉండాలి. అవును.. ఆమె దీప్తి భట్నాగర్. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి సందడి సినిమాతో దీప్తి తెలుగుతెరకు పరిచయమైంది.


శ్రీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో దీప్తి భట్నాగర్, రవళి హీరోయిన్స్ గా నటించారు. శ్రీకాంత్ కలలో కనిపించే అమ్మాయిగా దీప్తి భట్నాగర్ నటించింది. బొడ్డు కింద తాళాల గుత్తిని పెట్టుకోవడం అమ్మాయిలు దీప్తిని చూసాకే మొదలుపెట్టారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత తెలుగులో దీప్తి చాలా తక్కువ సినిమాల్లోనే కనిపించింది.


నాగార్జున సరసన ఆటో డ్రైవర్, బాలకృష్ణ సరసన సుల్తాన్, మా అన్నయ్య సినిమాలో రాజశేఖర్ ప్రేమించిన అమ్మాయి గా గెస్ట్ రోల్ చేసింది. చివరగా ఆమె మోహన్ బాబు సరసన కొండవీటి సింహాసనం సినిమాలో నటించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే డైరెక్టర్ రణదీప్ ఆర్యను ప్రేమించి పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యింది. కొన్నేళ్లు ఆమె ఎక్కడ ఉందో కూడా తెలియలేదు. అయితే సోషల్ మీడియా వచ్చాక మళ్లీ దీప్తి యాక్టివ్ అయ్యింది. అభిమానులకు దగ్గరయింది.

గత కొంతకాలంగా ఆమె కుటుంబంతో గడిపే ప్రతి మూమెంట్ ను అభిమానులతో పంచుకుంటుంది. 56 ఏళ్ల వయస్సులో కూడా ముద్దుగుమ్మ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ షాక్ ఇస్తుంది. దీప్తిని చూస్తుంటే ఇప్ప‌టికీ హీరోయిన్ పాత్ర‌లే కావాల‌న్నంత అందంగా ఫిజిక్ ను కాపాడుకుంటూ వస్తుంది. తాజాగా ఈ భామ తన వెకేషన్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక మంచి కథలు దొరికితే అమ్మడు రీఎంట్రీకి కూడా సిద్ధమని టాక్ నడుస్తోంది. మరి ముందు ముందు దీప్తి భట్నాగర్ తెలుగులో మళ్లీ కనిపిస్తుందేమో చూడాలి.

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×