BigTV English
Advertisement

Kalki 2898AD: బొమ్మ బ్లాక్ బాస్టర్.. ప్రభాస్ మూవీకి కూడా తప్పని తిప్పలు..!

Kalki 2898AD: బొమ్మ బ్లాక్ బాస్టర్.. ప్రభాస్ మూవీకి కూడా తప్పని తిప్పలు..!

Kalki 2898AD.. సక్సెస్ అనే దాహం కోసం ఎంతో పరితపించిన ప్రభాస్ (Prabhas ) ఎట్టకేలకు నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో కల్కి 2898AD సినిమా చేసి ఆ దాహాన్ని కాస్త తీర్చుకున్నారని చెప్పవచ్చు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్లలతో సినిమాలు నిర్మించి, నిర్మాతగా భారీ సక్సెస్ ను అందుకున్న వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినీ దత్ ఒకానొక సమయంలో వరుస ఫ్లాప్ లు చవి చూశారు. ఇక వైజయంతి బ్యానర్ ఎత్తిపోతుందని అందరూ అనుకున్న సమయంలో.. ఏకంగా రూ.700 కోట్ల బడ్జెట్ పెట్టి ఈ సినిమాను తెరకెక్కించారు. మైథాలజికల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను విపరీతంగా మెప్పించడమే కాకుండా.. రెట్టింపు స్థాయిలో లాభాలు కూడా అందుకుంది. దీంతో వైజయంతి బ్యానర్ కూడా ఈ సినిమాతో గట్టి కంబ్యాక్ ఇచ్చిందని చెప్పవచ్చు.


ప్రభాస్ మూవీకి కూడా తప్పని తిప్పలు..

ముఖ్యంగా రూ .1800 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి రికార్డు సృష్టించిన ఈ సినిమాకి కూడా ఇప్పుడు తిప్పలు తప్పడం లేదనే ఒక వార్త తెరపైకి వచ్చింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టిస్తున్న కల్కి సినిమా సాటిలైట్ హక్కులు ఇంకా అమ్ముడు పోలేదనే వార్త అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన సాటిలైట్ హక్కుల కోసం పలు చానల్స్ తో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ ఇప్పటివరకు ఈ డీల్ ఇంకా ఫైనల్ కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి.


సాటిలైట్ డీల్ కుదరనట్టేనా..

అయితే దీనికి కూడా ప్రధాన కారణం ఉందని సమాచారం. సాటిలైట్ హక్కుల కోసం టీవీ చానల్స్ చెబుతున్న ఫిగర్ కి వైజయంతి బ్యానర్ అంగీకరించడం లేదని సమాచారం. ముఖ్యంగా చిత్ర బృందం డిమాండ్ చేస్తున్న రేటుకి , టీవీ చానల్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ధరకు చాలా వ్యత్యాసం ఉండడంతో ఈ డీల్ ఇంకా పూర్తి కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ మా, జీ గ్రూప్ వంటి ప్రముఖ ఛానల్స్ తో చర్చలు జరుగుతున్నా.. ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రధాన కారణాలు కావచ్చు..

అసలు విషయంలోకెళితే.. ఒకవైపు ఓటీటీ ప్లాట్ఫామ్స్ పెరుగుతున్న నేపథ్యంలో టీవీ చానల్స్ కి కూడా ఆదాయం తగ్గుతుంది. ఎందుకంటే పెద్ద బడ్జెట్ చిత్రాలు కూడా థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాలలోపే ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. ప్రేక్షకులు కూడా టీవీ కంటే ఓటీటీ లో సినిమాలు చూడడానికే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీవీ చానల్స్ ద్వారా వచ్చే ఆదాయంలో కూడా తగ్గుదల ఉండడం అత్యంత సహజమని చెప్పవచ్చు. దీనికి తోడు చాలా చోట్ల అప్రూవల్ కాకపోయినా.. లోకల్ కేబుల్ ఆపరేటర్లు తమ ప్రైవేట్ చానల్స్ లో పెద్ద సినిమాలను ప్రసారం చేస్తున్నారు. దీని వల్ల చందాదారులను కూడా నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.ఈ పరిణామం కూడా సాటిలైట్ డీల్ ఆలస్యానికి కారణం కావచ్చనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే థియేటర్లో భారీ విజయం సొంతం చేసుకున్న ఈ సినిమాకి.. సాటిలైట్ హక్కులు అమ్ముడు పోకపోవడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పవచ్చు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×