Kalyan Ram:నటసింహ నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా సాయి మంజ్రేకర్ (Sai Manjrekar) హీరోయిన్ గా రాబోతున్న చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి.. తల్లీ కొడుకుల నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో కొడుకుగా కళ్యాణ్ రామ్, తల్లిగా లేడీ అమితాబ్ విజయశాంతి (Vijaya Shanti) నటిస్తున్నారు నూతన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా.. ఈ సినిమా ఈనెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చాలా గ్రాండ్గా ఈవెంట్స్ ఏర్పాటు చేస్తూ..అటు సినిమాను ప్రజలలోకి తీసుకెళ్లడమే కాకుండా ఇటు సినిమా నుంచి పాటలు కూడా రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు చిత్ర బృందం.
తల్లి గొప్పతనాన్ని అద్భుతంగా చెప్పిన కళ్యాణ్ రామ్..
ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుండి రెండవ సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ ను విడుదల చేయడం కోసం తిరుపతిలో ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈవెంట్ ఏర్పాటుచేసి.. “ముచ్చటగా బంధాలే” అనే పాట విడుదల చేశారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ తల్లి గొప్పతనాన్ని మాట్లాడుతూ.. నిస్వార్ధమైన ప్రేమ తల్లిదే అంటూ కామెంట్ చేశారు. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ” పిల్లలకు స్కూల్ నుంచి శని, ఆదివారాలు సెలవు దొరుకుతుంది. అటు మగవారికి ఆఫీస్ నుంచి శని, ఆదివారాలు సెలవులు లభిస్తాయి . మీరు సెలవు దినాలలో ఎంతో సంతోషంగా, హాయిగా, ఎటువంటి పని లేకుండా గడుపుతారు. కానీ మీ అందరికీ టైం టు టైం భోజనం ప్రిపేర్ చేసి, వంటింటి పనులు , ఇంటి పనులు , మీ పనులు అసలు తనకంటూ ఒక సమయాన్ని కేటాయించుకోకుండా నిస్వార్ధంగా పనిచేసేది ఒక తల్లి మాత్రమే. దయచేసి అలాంటి అమ్మకు రెస్పెక్ట్ ఇవ్వండి. అమ్మ లేనిదే మన పుట్టుక లేదు.” అంటూ తల్లి గొప్పతనాన్ని చాలా చక్కగా చెప్పుకొచ్చారు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
HBD Ayesha Takia: సక్సెస్ తో పాటూ అవమానాలు కూడా – కృష్ణవంశీ హీరోయిన్..!
విలువలు తెలిసిన వ్యక్తి మా కళ్యాణ్ బాబు – విజయశాంతి
ఇదే ఈవెంట్లో విజయశాంతి మాట్లాడుతూ.. ఎంతో విలువలు తెలిసిన వ్యక్తి మా కళ్యాణ్ బాబు.. అమ్మ ఎక్కడున్నా సరే బిడ్డను చూస్తూ ఉంటుంది. కళ్యాణ్ రామ్ తల్లి గురించి చెప్పిన మాటలు వింటుంటే చాలా ముచ్చటేస్తోంది. ఆయనకు ఎవరిని ఎలా గౌరవించాలో బాగా తెలుసు. ముఖ్యంగా నిస్వార్ధమైన తల్లి ప్రేమ మీకు తల్లి దగ్గర తప్ప మరెక్కడా లభించదు.. ఇక ఇదే విషయాన్ని మేము అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో చెప్పబోతున్నాము. ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 18న విడుదల కాబోయే మా సినిమాను చూసి కచ్చితంగా సూపర్ హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమా కోసం మేము ఎంతో కష్టపడ్డాము ” అంటూ విజయశాంతి చెప్పుకొచ్చింది. మొత్తానికైతే తల్లి కొడుకుల నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా మరింత విజయాన్ని అందుకోవాలని అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఒకవైపు హీరోగా మరొకవైపు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తూ మరింత బిజీగా మారిపోయారు.