BigTV English

TDP : క్లీన్ పాలిటిక్స్.. ఇదికదా చంద్రబాబు అంటే..

TDP : క్లీన్ పాలిటిక్స్.. ఇదికదా చంద్రబాబు అంటే..

TDP : ఐదేళ్ల వైసీపీ పాలన ఎంత అధ్వాన్నంగా సాగిందో అందరూ చూశారు. పాలనలో అడుగడుగునా అక్రమాలు. చంద్రబాబును సైతం జైల్లో పెట్టిన దుర్మార్గం. ఇక వైసీపీ సోషల్ మీడియా చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. పవన్ కల్యాణ్ కూతురు మీద కూడా దారుణమైన పోస్టులు పెట్టిన పైశాచికత్వం. టీడీపీ, జనసేన నాయకులను ఎవరినీ వదిలిపెట్టలేదు. మహిళా నేతలపై అమానుష మాటల దాడి జరిగింది. శ్రీరెడ్డిని ఎగదోశారు. సభ్యసమాజం సహించలేని భాష వాడారు. బూతులు, తిట్లు.. అబ్బో చెవులు, కళ్లు మూసుకోవాల్సిందే. ఆనాడు అంతలా రెచ్చిపోయింది బ్లూ సోషల్ మీడియా. నిండు అసెంబ్లీలో నారా భువనేశ్వరి మీదే కారు కూతలు కూశారు. చంద్రబాబుతో కన్నీళ్లు పెట్టించారు. కట్ చేస్తే.. ఆ పాపాలన్నీ పండి జగన్ ప్రభుత్వం పడిపోయింది. కూటమి సర్కారు కొలువదీరాక.. రివేంజ్ పాలిటిక్స్ నడుస్తాయేమోనని కొందరు అనుకున్నారు. బూతుకు బూతు.. తిట్టుకు తిట్టు.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తారని భావించారు. కానీ, అలా జరగడం లేదు. జగన్‌కు, చంద్రబాబుకు ఉన్న తేడా అదే మరి అంటున్నారు.


గీత దాటితే వేటే..

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ముందే చెప్పారు. మహిళలను కించపరిచేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదని ముందే తేల్చి చెప్పారు. అలాంటి చీప్ పాలిటిక్స్ చేయొద్దని కేడర్‌ను ముందే హెచ్చరించారు. అన్నట్టుగానే.. ఇప్పుడు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు హద్దు దాటిన కార్యకర్తపై వేటు వేశారు.


క్లీన్ పాలిటిక్స్.. చంద్రబాబు మార్క్

వైఎస్ భారతిపై అసభ్యకర కామెట్స్ చేసిన ITDP కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం చంద్రబాబు మార్క్ క్లీన్ పాలిటిక్స్‌కు నిదర్శనం అంటున్నారు. కిరణ్‌పై కేసు నమోదు చేసి, వెంటనే అరెస్ట్ చేయించారు. చంద్రబాబు తీరు ఇలా ఉంటుంది మరి. తమ పార్టీ వాడే కదాని ఏమాత్రం ఉపేక్షించలేదు. క్షణం కూడా ఆలోచించలేదు. తప్పు తప్పే. వైఎస్ భారతిని కించపరిచేలా అసభ్యంగా మాట్లాడటం ముమ్మాటికీ క్షమించరాని నేరమని సీరియస్ అయ్యారు. చేసిన తప్పు తెలుసుకుని కిరణ్ క్షమాపణలు కోరినా.. నో యూజ్.

Also Read : నోటిదూ** నేతలపై చర్యలు తీసుకునే దమ్ము వైసీపీకి ఉందా?

దటీజ్ బాబు.. ఎనీ డౌట్స్?

నోటికొచ్చినట్టు ఎవరు వాగినా వదిలిపెట్టేది లేదని చంద్రబాబు క్లియర్ కట్‌గా చెబుతున్నారు. వైసీపీ హయాంలో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్‌కు చిప్పకూడు తప్పలేదు. ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్న పోసానితో జైలు ఊచలు లెక్కబెట్టించారు. వల్లభనేని వంశీని లోపలేశారు. కొడాలి, జోగి, పేర్ని, రోజాలకు ముహూర్తం పెట్టేశారు. ఆర్జీవీనీ వదిలేదేలే అంటున్నారు. ఇలా గతంలో ఓవరాక్షన్ చేసిన అందరిపై యాక్షన్ నడుస్తోంది. వైసీపీ వాళ్లపై మాత్రమే కేసులు ఉంటాయని అనుకోటానికి లేదు. తాజా ఘటనలో టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పైనా కేసు నమోదు అవుతోందంటే.. ఇలాంటి విషయాలపై చంద్రబాబు ఎంత సీరియస్‌గా ఉన్నారో తెలుస్తోంది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు కామనే. ఆరోపణల వరకూ ఓకే. కానీ, ఇందులోకి మహిళలను లాగితే..? నోటికొచ్చినట్టు వాగితే..? తిట్టితే? బూతులు మాట్లాడితే..? తాట తీసుడే. అది ఎవరైనా. ప్రతిపక్షమైనా, స్వపక్షమైనా. దటీజ్ చంద్రబాబు. ఎనీ డౌట్స్?

Related News

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Big Stories

×