HBD Ayesha Takia: ప్రముఖ హీరోయిన్ ఆయేషా టాకియా (Ayesha Takia) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రముఖ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamshi) సహాయంతో ఇండస్ట్రీకి పరిచయమైన.. ఈమె నాగార్జున హీరోగా.. పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో వచ్చిన ‘సూపర్’ అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఇక ఈమె మొట్టమొదటిసారి హిందీ సినిమా ‘టార్జాన్: ది వండర్ కార్ ‘ సినిమా ద్వారా మంచి పేరు సొంతం చేసుకుంది.అంతేకాదు ఈ సినిమాతో ఫిలింఫేర్ ఉత్తమ డెబ్యూ నటి పురస్కారాన్ని కూడా సొంతం చేసుకుంది. ఇక అంతే కాదు 2005లో వచ్చిన సోచా నా థా, 2006లో వచ్చిన డోర్ పంటి చిత్రాలతో ఉత్తమ నటిగా స్క్రీన్ పురస్కారాలు కూడా అందుకుంది.
ఆయేషా టాకియా బాల్యం.. సినిమా జీవితం
.
1986 ఏప్రిల్ 10న మహారాష్ట్ర ముంబైలో జన్మించిన ఈమె తండ్రి హిందువు తల్లి ముస్లిం మతానికి చెందినవారు
ఈమె చెంబూర్ లోని సెయింట్ ఆంథోనీ బాలికల ఉన్నత పాఠశాలలో తన విద్యను పూర్తి చేసింది. 15 ఏళ్ల వయసులోనే మోడల్గా కెరియర్ ఆరంభించిన ఈమె ఆ తర్వాత.. ‘ఐ యామ్ ఏ కాంప్లాన్ గర్ల్ ‘ అనే ప్రకటనలో షాహిద్ కపూర్ (Shahid Kapoor) తో పాటు నటించింది. ఇక తర్వాత సినిమాలలో నటిస్తూ.. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ భారీ పాపులారిటీ అందుకున్న ఈమెకు.. ఈ సినిమాల ద్వారా ఎంత గుర్తింపు అయితే లభించిందో ఆ తర్వాత కాలంలో అంతే అవమానాలు ఎదుర్కొన్నాను అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఆయేషా. ఇకపోతే ఈరోజు ఆమె పుట్టిన రోజు కాబట్టే ఆమెకు సంబంధించిన పాత విషయాలు మళ్లీ వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకెళితే.. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే 23 సంవత్సరాలు వయసులో.. అంటే, 2009 మార్చి 1న సమాజ్వాది పార్టీ నాయకుడు అబూ అజ్మీ కుమారుడైన ఫర్హాన్ అజ్మీని వివాహం చేసుకోగా వీరికి ఒక కొడుకు కూడా జన్మించారు.వివాహం తర్వాత ఇస్లాం మతంలోకి మారిన ఈమె సినీ పరిశ్రమకు దూరమైంది.
Vishwambharam Update: విశ్వంభర నుండి అదిరిపోయే అప్డేట్.. ఫస్ట్ సింగిల్ ఆరోజే..!
సర్జరీ తర్వాతే అవమానాలు ఎదుర్కొన్న ఆయేషా..
అయితే గత కొన్ని సంవత్సరాల క్రితం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని వార్తలు రాగా.. సర్జరీ తర్వాత ఆమె ముఖం కూడా పూర్తిగా మారిపోయింది. ఇటీవల ఆమె లుక్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యాయి. దీంతో ఆమె తన ఖాతాలన్నింటినీ కూడా బ్లాక్ చేసేసింది. ఆ తర్వాత మళ్లీ ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ అయింది..ఇక ప్రస్తుతం ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను , వీడియోలను పంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా సినిమాలలో నటించి.. ఎంత గుర్తింపు తెచ్చుకున్నా.. సర్జరీ తర్వాత ఫేస్ మారిపోవడం వల్లే తాను అవమానాలు, ట్రోలింగ్స్ ఎదుర్కొన్నానని చెప్పి ఎమోషనల్ అయింది. ఇక అప్పటికి ఇప్పటికీ ఈమెలో చాలా మార్పు కనిపిస్తోందని చెప్పాలి. ఏది ఏమైనా మళ్లీ ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ అందులో భాగంగానే సర్జరీ చేయించుకుందా.. లేక ఇతర కారణాల వల్ల సర్జరీ చేయించుకుందా? అనే విషయం తెలియదు.. కానీ సర్జరీ తర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది ఆయేషా