Hair Fall: చాలామంది తలస్నానం చేసిన వెంటనే తడి జుట్టు దువ్వుతుంటారు. అలా చెయ్యడం వల్ల జుట్టు రాలిపోతుందని చెబుతుంటారు. అందులో నిజం ఎంత? తడి జుట్టును దువ్వితే జుట్టు రాలిపోతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?
జుట్టు తడిగా ఉన్నప్పుడు, అది మృదువుగా , పెళుసుగా ఉంటుంది. నీరు జుట్టును ఉబ్బేలా చేస్తుంది, ఇది ప్రతి తంతువు నిర్మాణాన్ని బలహీనపరుస్తుంది. తడి జుట్టును గట్టిగా దువ్వితే జుట్టు విరిగిపోతుంది లేదా ఊడిపోతుంది. అలాగే తడి జుట్టు దువ్వడం వల్ల జుట్టు కుదుళ్లకు నష్టం వాటిల్లుతుంది. ఇది జుట్టు రాలడానికి దారితీస్తుంది.
జుట్టు రాలడం:
తడి జుట్టు దువ్వడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనంగా మారతాయి. దాని వల్ల జుట్టు త్వరగా రాలిపోతుంది. తల స్నానం చేసిన వెంటనే తలను ఆరనివ్వాలి. తడిపైనే దువ్వితే.. జుట్టు దువ్వెనలో చిక్కుకుని సులభంగా ఊడిపోతుంది. జుట్టు మూలం నుండి బయటకు రావడం , చివరలు చిట్లడం వంటివి జరుగుతాయి. దీనివల్ల జుట్టు పెరుగుదల కూడా ఆగిపోతుందని నిపుణులు అంటున్నారు.
Also Read: తల్లిదండ్రులు చేసే తప్పులు.. పిల్లలపై ప్రభావం చూపుతుంది.. జాగ్రత్త!
తడి జుట్టు ఎందుకు రాలుతోంది:
తడి జుట్టు దువ్వడం ద్వారా కాలక్రమేణా జుట్టు రాలడం పెరుగుతుంది. మీ జుట్టు సన్నగా అవుతుంది. మీరు సరైన దువ్వెనను ఉపయోగించకున్న మీ జుట్టు ఎక్కువగా రాలుతోంది. అందుకే వెడల్పాటి దువ్వెనను ఉపయోగించండి. అలాగే జుట్టుకు నూనె పూర్తిగా వదలకున్న కూడా ఎక్కువగా రాలుతుంది. బయటి ఆహారం తీసుకోవడం వల్ల చాలా మంది చిన్న వయస్సులోనే జుట్టు రాలడం, జుట్టు నెరిసిపోయే సమస్యను ఎదుర్కొంటున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
తడి జుట్టను దువ్వడం మానుకోండి. మీరు దువ్వేటప్పుడు నెమ్మదిగా దువ్వండి.. ఇలా దువ్వడం వల్ల జుట్టు విరగకుండా నాట్లను తొలగించడంలో సహాయపడుతుంది. తడి జుట్టును దువ్వడానికి బదులుగా, వేళ్ళతో సున్నితంగా విడదీయండి. మీ జుట్టును దువ్వడానికి వెడల్పాటి పళ్ళతో కూడిన దువ్వెనను ఉపయోగించండి. జుట్టు ఆరిన తరువాత దువ్వడం మరి మంచిది. ఇలా చేయడం వల్ల మీ జుట్టు తెగిపోకుండా కాపాడుకోవచ్చు, దానిని బలంగా.. ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.