BigTV English

Kalyan Ram : బింబిసార కాంబినేషన్ రిపీట్.. కళ్యాణ్ కు హిట్ వస్తుందా ?

Kalyan Ram : బింబిసార కాంబినేషన్ రిపీట్.. కళ్యాణ్ కు హిట్ వస్తుందా ?
Kalyan Ram new movie update

Kalyan Ram new movie update(Telugu cinema news):

నందమూరి కళ్యాణ్ రామ్.. నందమూరి నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ హీరో.. కెరీర్ మొదట్లో మంచి ప్రామిసింగ్ సినిమాలు చేసి యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఈ హీరోకి బింబిసార సినిమాతో మంచి కం బ్యాక్ దొరికింది. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ నటన విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇందులో హీరోయిన్స్ గా నటించిన హాట్ బ్యూటీస్ సంయుక్తా మీనన్,కేథ‌రిన్ థెస్రా లు ఈ మూవీతో మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు.


బింబిసార చిత్రం..సీతారామం లాంటి క్లాసిక్ హిట్స్ తాకిడి తట్టుకొని సూపర్ హిట్ మూవీ గా నిలబడడమే కాకుండా సుమారు 50 కోట్ల వరకు వసూలు రాబట్టింది.దీంతో ముఖ్యంగా ఈ మూవీలో హీరోయిన్ సంయుక్త మీనన్ టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఎందుకంటే ఆమె ఖాతాలో వరుసగా సార్ ,భీమ్లా నాయక్, విరూపాక్ష, బింబిసార.. ఇలా క్రేజీ హిట్స్ ఉన్నాయి. పైగా ఇప్పుడు ఈమె కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ లో కూడా నటిస్తోంది.

డెవిల్ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై..అభిషేక్ నామా తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే మొదట ఈ చిత్రానికి డైరెక్టర్గా నవీన్ మేడారంను అనుకున్నారు. డైరెక్టర్ కి నిర్మాత కి పోసకపోవడంతో దర్శకత్వ బాధ్యతలు అభిషేక్ తన చేతిలోకి తీసుకున్నారు. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. 


ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ , గ్లింప్స్ వీడియో మూవీ పై ఆసక్తి రేపే విధంగా ఉన్నాయి. ఇందులో కళ్యాణ్ రామ్ లుక్ పై కూడా మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ మూవీతో కళ్యాణ్ రామ్ మరో క్లీన్ క్లాసికల్ హిట్ అందుకుంటాడు అని అభిమానులు ఆశిస్తున్నారు.మరి సంయుక్త మీనన్ ఈ సారి కి కూడా ..కళ్యాణ్ రామ్ కు లక్కీ స్టార్ అవుతుందేమో చూడాలి. ఈ మూవీ ఈనెల 29న విడుదల అవుతుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×