BigTV English
Advertisement

Cricket players Life : క్రికెటర్ల జీవితాల్లో తెరవెనుక.. ఎన్నో విషాదాలు

Cricket players Life  : క్రికెటర్ల జీవితాల్లో తెరవెనుక.. ఎన్నో విషాదాలు
Cricket players Life

Cricket players Life : ఆసిస్ తో జరిగిన టీ 20 ఆఖరి మ్యాచ్ లో దీపక్ చాహర్ ఉన్నట్టుండి ఇంటికి వెళ్లిపోయాడు. అందరూ ఏమైందని అనుకున్నారు. అతని స్థానంలో అర్షదీప్ సింగ్ వచ్చి, మ్యాచ్ ని గెలిపించాడు. అయితే దీపక్ చాహర్ ఎందుకెళ్లిపోయాడని అంతా రకరకాలుగా అనుకున్నారు. మెడికల్ ఎమర్జన్సీ తో చాహర్ ఇంటికి వెళ్లాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. అయితే అందరూ మాత్రం చాహర్ భార్య ప్రెగ్నెన్సీ కావడంతో వెళ్లినట్టు భావించారు.


ఈ విషయంపై దీపక్ చాహర్ నోరు మెదిపాడు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చిందని తెలిపాడు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని, ఈ విషయాన్ని కోచ్ ద్రవిడ్ కి, టీమ్ మేనేజ్మెంట్ కి, సెలక్టర్లకి అందరికీ తెలిపానని అన్నాడు. సమయానికి ఆయన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లడం వల్ల కాపాడుకోగలిగామని అన్నాడు.

మా నాన్నగారు పూర్తిగా కోలుకున్న తర్వాతనే సౌతాఫ్రికా పర్యటనకు వెళతానని చెప్పాడు. నన్ను క్రికెటర్‌ను చేయడానికి ఆయనెంతో శ్రమ పడ్డారు. అలాంటిది ఆయన అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే మైదానంలో మనసు పెట్టి ఆడలేనని తెలిపాడు. దీంతో నెట్టింట కామెంట్లు తగ్గాయి. చాహర్ తండ్రి త్వరగా కోలుకోవాలని అందరూ మెసేజ్ లు పెడుతున్నారు.


విరామం లేకుండా ఎడతెగని క్రికెట్ ఆడుతున్న క్రికెటర్లకు ఇంటి దగ్గర ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కెరీర్ ని పణంగా పెట్టి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇదే సిరీస్ లో ముఖేష్ కుమార్ పెళ్లి జరిగింది. దాంతో తను ఒక టీ 20 మ్యాచ్ కు హాజరు కాలేదు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ మహ్మద్ షమీ తల్లి అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. సమయానికి షమీ కూడా వెళ్లలేకపోయాడు. ఇలాంటివెన్నో ఘటనలు పెద్ద పెద్ద క్రికెటర్ల జీవితాల్లో కూడా జరగడం విషాదమేనని చెప్పాలి.

సాక్షాత్తూ క్రికెట్ దేవుడైన సచిన్ టెండుల్కర్ తండ్రి కూడా 1999 వరల్డ్ కప్ సమయంలో ఇంగ్లండ్ లో ఉండగా మరణించారు. అప్పటికప్పుడు తను ఇండియాకి వచ్చి, తండ్రి అంత్యక్రియల్లో పాల్గొని, రెండురోజుల్లో తిరిగి ఇంగ్లండ్ వెళ్లిపోయాడు. యథావిధిగా వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడాడు.

విరాట్ కొహ్లీ తండ్రి కూడా ఇలాగే రంజీ మ్యాచ్ మధ్యలో ఉండగా మరణించాడు. విషయం తెలిసిన కొహ్లీ మాత్రం మ్యాచ్ ముగిసిన తర్వాతే వెళ్లాడు. ఎందుకంటే తన తండ్రి గొప్ప క్రికెటర్ గా చూడాలని అనుకున్నాడు. ఈ సమయంలో వెళితే ఆయన కోరిక నెరవేరదు. జాతీయ జట్టు ఎంపికలో ఈ మ్యాచ్ ఎంతో కీలకమని భావించి ఆటను కొనసాగించాడు. సూపర్ సెంచరీ చేశాడు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చాడు.

ఇన్నికోట్ల మంది ప్రజలకి ఆనందాన్నిచ్చే క్రికెటర్ల జీవితాలు… తెరవెనుక చూస్తే ఎన్నో విషాదాలతో నిండి ఉంటుందనడానికి దీపక్ చాపర్ ఘటన తాజా ఉదాహరణ అని చెప్పాలి.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటి ద‌గ్గ‌ర క‌ల‌క‌లం…కేక్ తీసుకొచ్చిన ఆగంత‌కుడు !

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Big Stories

×