E-Paper
Advertisement

Indian 2 OTT Release: ఇట్స్ అఫీషియల్‌.. ‘ఇండియన్ 2’ ఓటీటీ ప్రీమియర్ డేట్ అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్

Indian 2 OTT Release: ఇట్స్ అఫీషియల్‌.. ‘ఇండియన్ 2’ ఓటీటీ ప్రీమియర్ డేట్ అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్
Advertisement

Indian 2 OTT Release: కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంటాయి. మరికొన్ని మాత్రం అనౌన్స్ చేసినప్పటి నుంచి ఒకటే హంగామా క్రియేట్ చేస్తుంటాయి. సినిమాపై ఆశలు రేపుతూ ఒక్కో అప్డేట్‌తో అంచనాలు పెంచేస్తుంటాయి. ఆఖరికి థియేటర్లలో రిలీజ్ అయ్యాక నీరుగార్చేస్తాయి. అలాంటిదే ‘ఇండియన్ 2’ మూవీ. ఈ సినిమా తెరకెక్కడానికి దాదాపు 3 ఏళ్లు పట్టింది. గత 28 ఏళ్ల క్రితం వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ తెరకెక్కింది.

అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఒకటే ఆసక్తి. అందులోనూ హీరో, డైరెక్టర్ స్టార్లు కావడంతో అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగిపోయాయి. విలక్షణ నటుడు కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందింది. భారీ అంచనాల నడుమ జూలై 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ షో తోనే తేలిపోయింది. ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన లభించలేదు. బాక్సాఫీసును షేక్ చేస్తుందనుకున్న ఈ సినిమా బోల్తాపడింది.

Advertisement

Also Read: ‘ఇండియన్ 2’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఛా.. మరీ ఇంత దారుణంగానా..!

అనుకున్న కలెక్షన్లు సైతం అందుకోలేకపోయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సెకండ్ పార్ట్ రిలీజ్‌కు ముందే మరో సీక్వెల్‌ను సిద్ధం చేసింది. వచ్చే ఏడాది ఆ కొత్త సీక్వెల్‌ను రిలీజ్ చేస్తామని కూడా చెప్పుకొచ్చింది. ఈ మేరకు ట్రైలర్ కూడా వదిలింది. ఇలా అన్నింటిని పక్కాగా ప్లాన్ చేసుకుంది మూవీ యూనిట్. కానీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.

Advertisement

ఈ నేపథ్యంలో ఓటీటీ ఆడియన్స్‌కు అదిరిపోయే అప్డేట్‌ బయటకొచ్చింది. నెల రోజులు తిరగకుండానే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అఫీషియల్‌గా అప్డేట్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు సొంతం చేసుకుంది. దీంతో ఈ నెల అంటే ఆగస్టు 9 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘ఇండియన్ 2’ స్ట్రీమింగ్ కానుంది. అందువల్ల థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీల్లో చూసేయొచ్చు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×