E-Paper
Advertisement

Kamal Haasan – Rajinikanth : ఇద్దరు స్టార్స్ మధ్య రీ రిలీజ్ వార్.. గెలుపు ఎవరిదో..

Kamal Haasan – Rajinikanth : ఇద్దరు స్టార్స్ మధ్య రీ రిలీజ్ వార్.. గెలుపు ఎవరిదో..
Advertisement

Kamal Haasan – Rajinikanth : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కువగా ఉంది. ఒకప్పుడు సక్సెస్ సాధించిన స్టార్ హీరోల సినిమాలను మొదట్లో వాళ్ల పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేసి..కాస్త హడావిడి చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు సమయం, సందర్భంతో పని లేకుండా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సినిమాలను రీ రిలీజ్ చేసేస్తున్నారు. ఎప్పుడో 18 ఏళ్ల క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర డి అంటే డి అన్న సూపర్ స్టార్స్.. ఇప్పుడు తిరిగి ఆ ఇద్దరి హీరోల సినిమాలు ఒకేసారి రీ రిలీజ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలేంటి.. ఆ హీరోలు ఎవరు తెలుసుకుందాం పదండి..

రజనీకాంత్.. కమల్ హాసన్.. తమిళ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు పోటీపడి సినిమాలు తీసిన ఈ ఇద్దరు స్టార్ హీరోలు..టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. కమల్ హాసన్ నటించిన ఎన్నో చిత్రాలు మాస్టర్ పీస్ గా మిగిలిపోయాయి. వాటికి రీమేక్ అనేది అసంభవం అనే చెప్పాలి. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఊహించని విధంగా డిజాస్టర్స్ గా మిగిలాయి. అలాంటి సినిమాల్లో ఒకటి ఆళవంధన్. దీన్ని తెలుగులో అభయ్ గా డబ్ చేసి విడుదల చేశారు. కమల్ హాసన్ నెగిటివ్ షెడ్ లో నటించిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది.

Advertisement

రజనీకాంత్ సినీ కెరియర్లో ఆణిముత్యాలు ఎన్నో ఉన్నాయి.. తెలుగులో డబ్ అయిన రజనీకాంత్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన సందర్భాలు ఉన్నాయి. అలా ఎన్నో రికార్డులను బ్రేక్ చేసిన రజిని చిత్రం ముత్తు. ఇండియన్ సినిమాలకు ఓవర్సీస్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచిన మూవీ ముత్తు అనడంలో ఎటువంటి డౌటు లేదు. ఈ మూవీ లోని తిలానా తిలానా సాంగ్ ఇప్పటికీ ఎంతో ఫేమస్.

ఇద్దరూ క్రేజీ స్టార్స్.. ఇద్దరి సినిమాలకు మంచి ఆదరణ ఉంది.. ఈ నేపథ్యంలో రేపు డిసెంబర్ 8వ తారీఖున కమల్ హాసన్ ఆళవంధన్.. రజిని ముత్తు థియేటర్లలో రీ రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఇందులో స్పెషాలిటీ ఏమిటా అనుకుంటున్నారా.. ఇప్పటివరకు ఏ రీ రిలీజ్ చిత్రానికి దక్కనటువంటి భారీ క్రెడిట్ ఈ రెండు చిత్రాలకు దక్కబోతోంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్స్ పై ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంతా బాగానే ఉంది కానీ రికార్డులు బ్రేక్ చేసిన ముత్తు సినిమాకి కమర్షియల్ గా నిలబడలేకపోయిన ఆళవంధన్‌ ఇప్పుడు పోటీ ఇవ్వగలుగుతుందా లేదా అనేది చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×