BigTV English

Kamal Haasan: కమల్ పుట్టినరోజుకు సిద్ధంగా ఉండండి థగ్స్.. మణిరత్నం నుండి స్పెషల్ సర్‌ప్రైజ్ రాబోతుంది

Kamal Haasan: కమల్ పుట్టినరోజుకు సిద్ధంగా ఉండండి థగ్స్.. మణిరత్నం నుండి స్పెషల్ సర్‌ప్రైజ్ రాబోతుంది
Advertisement

Kamal Haasan: కోలీవుడ్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఉలగనాయగన్‌గా పేరు తెచ్చుకున్నారు కమల్ హాసన్. అందుకే ఆయన పుట్టినరోజు అంటే ఫ్యాన్స్‌కు పండగే. కమల్ పుట్టినరోజు అనగానే సోషల్ మీడియా అంతా ఆయన విషెస్‌తో నిండిపోతుంది. అంతే కాకుండా ఆయన అప్‌కమింగ్ సినిమాల నుండి ఎలాంటి అప్డేట్ వచ్చినా చాలు అని ఫ్యాన్స్ ఫీలవుతుంటారు. అందుకే కమల్ హాసర్ బర్త్ డే కోసం సీనియర్ డైరెక్టర్ మణిరత్నం ఒక సర్‌ప్రైజ్‌ను ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఆ సర్‌ప్రైజ్ ఏంటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. థగ్స్ అంతా సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. నవంబర్ 7న కమల్ ఫ్యాన్స్‌కు కొత్త ట్రీట్ ఉండబోతుంది.


34 ఏళ్ల తర్వాత

కమల్ హాసన్, మణిరత్నం (Mani Ratnam) కాంబినేషన్‌లో ‘నాయగన్’ అనే సినిమా తెరకెక్కింది. అది 1987లో విడుదలయ్యింది. అయినా ఇప్పటికీ కమల్ హాసన్ (Kamal Haasan) క్లాసిక్ హిట్స్‌లో ‘నాయగన్’ కూడా ఒకటిగా నిలిచిపోయింది. అందుకే ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే ఫ్యాన్స్‌కు చాలా ఇష్టం. ఈ సినిమా విడుదలయ్యి దాదాపు 34 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటివరకు వీరిద్దరూ మళ్లీ కలిసి సినిమా చేసే ఛాన్సే రాలేదు. ఇన్నాళ్ల తర్వాత వీరి కాంబోలో ‘థగ్ లైఫ్’ అనే సినిమా రాబోతుందని ప్రకటించి అందరినీ హ్యాపీ చేశారు. ఇక ఇప్పటికే ‘థగ్ లైఫ్’ (Thug Life) సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ వివరాలు బయటికి రాగా.. కమల్ పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్‌ను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు.


Also Read: విజయ్ తో రూమర్స్ పై దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన త్రిష..!

ఏదైనా ఓకే

నవంబర్ 7న కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ‘థగ్ లైఫ్’కు సంబంధించిన గ్లింప్స్ విడుదల కానుంది. ఉదయం 11 గంటలకు ఈ గ్లింప్స్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ‘థగ్ లైఫ్’ సినిమాను అనౌన్స్ చేయడం కోసం, అందులో కమల్ హాసన్ ఎలా ఉంటారో చూపించడం కోసం ఇప్పటికే ఒక చిన్న గ్లింప్స్ విడుదలయ్యింది. కానీ అది విడుదలయ్యి చాలా రోజులే అయ్యింది. ఇప్పుడు కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి గ్లింప్స్ విడుదల చేస్తారా లేదా టీజర్ లాంటిది ఏమైనా విడుదల చేస్తారా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఏదైనా కూడా కమల్ పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒకటి బయటికొచ్చినా చాలు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

విలన్‌గా యంగ్ హీరో

కమల్ హాసన్ కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. అలాంటి సమయంలోనే లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విక్రమ్’.. ఆయనను మళ్లీ హిట్ ట్రాక్‌పై నిలబెట్టింది. ఇప్పుడు అదే జోష్‌లో మరికొన్ని సినిమాలు లైన్‌లో పెట్టారు కమల్. అందులో ‘థగ్ లైఫ్’ కూడా ఒకటి. ఇప్పటికే ఈ మూవీపై ప్రేక్షకుల్లో చాలా అంచనాలే ఉన్నాయి. ఇందులో కమల్ హాసన్‌కు ధీటైన విలన్ పాత్రలో శింబు నటించనున్నాడు. హీరోయిన్‌గా త్రిష అలరించనుంది. ఇప్పటికే ‘థగ్ లైఫ్’ మూవీ షూటింగ్ పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

Related News

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Big Stories

×