BigTV English

Trisha: విజయ్ తో రూమర్స్ పై దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన త్రిష..!

Trisha: విజయ్ తో రూమర్స్ పై దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన త్రిష..!

Trisha: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దళపతి (Vijay Thalapathi)తో అలనాటి సీనియర్ హీరోయిన్ అందాల తార త్రిష కృష్ణన్ (Trisha Krishnan) రిలేషన్ లో ఉందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు వీరిద్దరికీ సంబంధించిన పలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. విజయ్ తన భార్యకు విడాకులు ఇచ్చి త్రిష ను వివాహం చేసుకోబోతున్నారు అంటూ కొన్ని రూమర్స్ గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా డైరెక్ట్ పోస్ట్ పెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది త్రిష.


రీ ఎంట్రీ లో భారీ సక్సెస్..

నాలుగు పదుల వయసులో కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న త్రిష కృష్ణన్ తెలుగులో దాదాపు స్టార్ హీరోలు అందరితో కూడా కలిసి నటించింది. చిరంజీవి (Chiranjeevi ) , ప్రభాస్ (Prabhash ), గోపీచంద్ (Gopichand) ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది హీరోల సరసన నటించే స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న ఆ తర్వాత అవకాశాలు లేక కోలీవుడ్ కి పరిమితమైంది. అయితే ఈ మధ్య మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన త్రిష మళ్లీ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. విజయ్ తో లియో చిత్రం చేసి మరింత ఆకట్టుకుంది.


విజయ్ తో డేటింగ్ రూమర్స్ కి చెక్..

ఇకపోతే ఈమధ్య విజయ్ తో డేటింగ్ చేస్తోంది అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు రావడంతో ఈ వార్తలపై ఇన్ డైరెక్ట్ గా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేసింది త్రిష. త్రిష సోషల్ మీడియా ఖాతా ద్వారా ఇలా రాసుకుంది. ” ఎంతోమంది చేసే తప్పులను పట్టించుకునే తీరిక , ఓపిక రెండూ నా దగ్గర లేవు. దానికి నా ఎనర్జీని నేను వృధా చేసుకోవాలనుకోవట్లేదు. ఒకవేళ ఎవరైనా నా గురించి చెత్తగా రాసినా.. మాట్లాడినా దానికి నేను క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. ముఖ్యంగా గొడవ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. గొడవపడి డ్రామా క్రియేట్ చేయడం అంతకన్నా ఇష్టం లేదు. అలాంటి వారికి దూరంగా ఉంటూ సైలెంట్ గా ఉండటమే ఉత్తమమైన పని. నీ లైఫ్ లో నీకు ఎవరో ఒకరు.. ఏదో ఒకటి చేస్తారని ఎదురు చూడకుండా.. ఒకరి నుంచి నీవు ఏమి ఆశించకుండా.. నీ జీవితానికి ఏది బాగుంటుందో.. ఏది కావాలో దానిపై దృష్టి పెట్టుకో.. ఎవరు ఏమన్నా పట్టించుకోకు.. ” అంటూ త్రిష తనపై వస్తున్న పుకార్లకు పులిస్టాప్ పెట్టే విధంగా ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేసింది. ప్రస్తుతం త్రిష షేర్ చేసిన ఈ కామెంట్లు అందరినీ నోరు మూయించేలా ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా విజయ్ తో ఈమె డేటింగ్ లో ఉంది అంటూ వస్తున్న వార్తలకు ఈ రకంగా చెక్ పెట్టిందని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.

చిరంజీవితో మళ్లీ జతకట్టనున్న త్రిష..

ఇక త్రిష విషయానికి వస్తే చాలా ఏళ్ల తర్వాత మళ్లీ చిరంజీవితో జతకట్టబోతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా హిట్ అయితే మళ్లీ తెలుగులో గట్టి కం బ్యాక్ ఇవ్వబోతోందని చెప్పవచ్చు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×