Kamal Haasan Thug Life:..దాదాపు 38 ఏళ్ల తర్వాత సీనియర్ స్టార్ హీరో కమలహాసన్ (Kamal Haasan), ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం (Maniratnam ) కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘థగ్ లైఫ్’. భారీ అంచనాల మధ్య జూన్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్రిష కృష్ణన్ (Trisha Krishnan) హీరోయిన్ గా రాబోతున్న ఈ చిత్రంలో శింబు (Simbu), సన్యా మల్హోత్రా (Sanya Malhotra), అశోక్ సెల్వన్ (Ashok Selvan), ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi), జోజూ జార్జ్, నాజర్, రోహిత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ అలాగే మద్రాస్ టాకీస్ తో పాటు రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ వారు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్ర బృందం. ఇక అందులో భాగంగానే సౌత్ టూ నార్త్ చాలా గట్టిగానే ప్లాన్ చేసిందని చెప్పవచ్చు. ఇకపోతే విడుదల తేదీ జూన్ 5 కాబట్టి అప్పటివరకు సినిమాను ఆడియన్స్ లోకి తీసుకెళ్లడానికి చిత్ర బృందం రోజుకొక ఈవెంట్ చొప్పున చక్కగా ప్లాన్ చేసుకొని, మే 17 మొదలు జూన్ 1 వరకు సినిమాను ప్రమోషన్స్ పేరిట ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయబోతున్నారు.
థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్స్ షెడ్యూల్ విషయానికి వస్తే..
అందులో భాగంగానే కనీ వినీ ఎరుగని రీతిలో ఈ సినిమాకి ఏకంగా 6 ప్రదేశాలలో 6 సార్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారని తెలిసి, అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే..
ట్రైలర్ లాంఛ్ (తమిళ్) – మే 17
ట్రైలర్ లాంఛ్ (హిందీ) – మే 20
ట్రైలర్ లాంఛ్ (మలయాళం) – మే 21
ట్రైలర్ లాంఛ్ (తెలుగు) – మే 22
ఆడియో లాంచ్ – మే 24 – సాయిరాం కాలేజ్
ప్రీ రిలీజ్ ఈవెంట్ ( ఢిల్లీ ) – మే 26
ప్రీ రిలీజ్ ఈవెంట్ (బెంగళూరు) – మే 27
ప్రీ రిలీజ్ ఈవెంట్ (తిరువేండ్రం) – మే 28
ప్రీ రిలీజ్ ఈవెంట్ (వైజాగ్) – మే 29
ప్రీ రిలీజ్ ఈవెంట్ (మలేషియా) – మే 31
ప్రీ రిలీజ్ ఈవెంట్( దుబాయ్) – జూన్ 1
ALSO READ: 7G Rainbow Colony 2: భార్యనే మార్చేశాడు.. ఈ డైరెక్టర్ సాహసానికి సలాం చెప్పాల్సిందే..!
విడుదలకు ముందే లాభాల బాట పట్టిన థగ్ లైఫ్..
ఇలా మొత్తం 12 రోజులపాటు ఈ సినిమా ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహించనుంది చిత్ర బృందం. మొత్తానికైతే ప్రమోషన్స్ ను గట్టిగానే ప్లాన్ చేశారు అటు మణిరత్నం ఇటు కమల్ హాసన్. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా ఈ సినిమాకు ఇప్పటికే ఆశ్చర్యపోయే డీల్ కుదిరింది. అటు ఓటీటీ హక్కుల కోసం నెట్ఫ్లిక్స్ రూ.150 కోట్లకు ఈ సినిమాను కొనుగోలు చేయగా.. ఇటు టీవీ హక్కుల కోసం విజయ్ టీవీ ఏకంగా రూ.60 కోట్లు కేటాయించింది. ఇక నాన్ థియేట్రికల్ హక్కులు సుమారుగా రూ.210 కోట్లకు అమ్ముడు పోయాయి. ఇలా మొత్తంగా విడుదలకు ముందే లాభాల బాట పట్టిన ఈ సినిమా.. విడుదల తర్వాత ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.