E-Paper
Advertisement

Tollywood: అస్కార్ కమిటీయే మనల్ని సలహా అడిగే రేంజ్ రావాలి : కమల్ హాసన్

Tollywood: అస్కార్ కమిటీయే మనల్ని సలహా అడిగే రేంజ్ రావాలి : కమల్ హాసన్
Advertisement

Kamal Hassan latest movie update(Today tollywood news):
లోక నాయకుడు కమల్ హాసన్ చేసిన ప్రయోగాలు, పాత్రలు ఇంకెవ్వరూ చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఓ మూకీ పాత్ర చెయ్యాలన్నా, మరుగుజ్జు పాత్రలో ఒరిగిపోవాలన్నా, పది పాత్రలలో పరకాయ ప్రవేశం చేయాలన్నా కమల్ కి మించిన నటుడు లేడని యావత్ సినిమా ఇండస్ట్రీ ముక్తకంఠంతో చెబుతుంది. తెలుగు ప్రేక్షకులలోనూ కమల్ హాసన్ అంటే ఓ రేంజ్ లో ఆయన సినిమాను ఊహించుకుంటుంటారు. ఆయన లేటెస్ట్ మూవీ భారతీయుడు -2 మూవీ ఈ నెల 12న విడుదల కాబోతోంది.

28 ఏళ్ల తర్వాత మళ్లీ..

Advertisement

28 సంవత్సరాల క్రితం శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ మూవీ స్ఫూర్తితో..లంచాల నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలానే వచ్చాయి. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో కమల్ మాట్లాడుతూ ‘ప్రస్తుతం మన సినిమాలు కూడా ఆస్కార్ స్థాయికి చేరుకోవడం నిజంగా గర్వకారణం. భారతీయులకూ ఆ స్థాయి టాలెంట్ ఉందని నిరూపణ అయింది. అయితే అది తాత్కాలికం కాకూడదు. ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కువ సినిమాలు నిర్మించేది కేవలం తెలుగు సినిమా పరిశ్రమే కావడం మనందరికీ గర్వకారణం. సినిమాలు తీసే చిన్న, పెద్ద నిర్మాతలంతా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏదో చేశాం..తీశాం అన్నట్లు కాకుండా ప్రపంచ స్థాయిలో మన సినిమా గురించి చర్చించుకునే విధంగా ఉండాలి మన సినిమాలు. ఒకప్పుడు ఆస్కార్ నామినేషన్ పొందడమే గర్వంగా భావించేవాళ్లం. అలాంటిది అస్కార్ విభాగాలలో మన భారతీయ సినిమాలు ఉండటం చూస్తుంటే నా హృదయం ఉప్పొంగుతోంది.

పాత్ర గురించి ఆలోచించను

Advertisement

ఎప్పుడైతే మన సినిమాలు ఆస్కార్ స్థాయిలో నిలుస్తాయో అప్పుడు ఏకంగా ఆస్కార్ కమిటీ సభ్యులే మనలను సలహా అడిగే రేంజ్ కు మనం చేరుకుంటాం. ఇదీ మా స్టామినా, ఇదీ మా రేంజ్ అనే స్థాయిలో మన సినిమాలు ఉండాలి. ఇదేదో నేను గర్వంగా, పొగరుగా చెబుతున్న మాటలు కావు. నేనెప్పుడూ నా పాత్ర ఎంత సేపు ఉంది అని ఆలోచించను. నిడివి తక్కువైనా ఆ పాత్ర ప్రభావం గురించే ఆలోచిస్తాను. ప్రస్తుత జనరేషన్ కు తగ్గ సినిమా భారతీయుడు-2. దాదాపు భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంతో ముడిపడిన సినిమా ఇది.

నేటి సమాజానికి అవసరం

భారతీయుడు ఎంత కొత్తగా ఉండాలో..రొటీన్ కు భిన్నంగా ఉండేలా ఆలోచననుంచే పుట్టిందే ఈ కథ. నేటి ట్రెండ్ కు అనుగుణంగా, నేటి వ్యవస్థకు కూడా ఓ భారతీయుడి అవసరం ఉండే విధంగా సినిమాను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు మా దర్శకుడు శంకర్. భారతీయుడు సినిమాను నాకు 40 సంవత్సరాల వయసులో 80 సంవత్సరాల వృద్ధుడి పాత్ర చేశాను. అదంతా దర్శకుడు నన్ను మలిచిన ప్రతిభ. ఆయన ఏం చెప్పారో అదే చేశాను. ఇప్పుడు కూడా 28 ఏళ్ల తర్వాత అదే అదే కసి కనిపిస్తోంది దర్శకుడు శంకర్ లో. కథ వింటున్నప్పుడే ఉద్వేగానికి గురయ్యా. ఇలాంటి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించిన దర్శకులకు నేను ఎన్నటికీ రుణపడి ఉంటాను’

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×