E-Paper
Advertisement

Fritz beat Zverev: వింబుల్డన్‌లో మరో సంచలనం, టాప్ సీడ్ ఆటగాడు ఔట్

Fritz beat Zverev: వింబుల్డన్‌లో మరో సంచలనం, టాప్ సీడ్ ఆటగాడు ఔట్
Advertisement

Fritz beat Zverev: లండన్‌లో జరుగుతున్న వింబుల్డన్ టోర్నమెంట్ ఆసక్తికరంగా సాగుతోంది. మహిళల, పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీట్ ఆటగాళ్లు ఇంటిదారి పడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో ఆటగాడు చేరిపోయాడు. జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ వంతైంది.

సోమవారం వింబుల్డన్‌లో ఊహించని మ్యాచ్ జరిగింది. నాలుగో నెంబర్ ఆటగాడు జ్వెరెవ్ ఖంగుతిన్నాడు. అంతేకాదు టోర్నీ నుంచి ఊహించని రీతిలో వెనుదిరిగాడు. జర్మనీకి చెందిన నాలుగో సీడ్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్- అమెరికాకు చెందిన టేలర్ ఫ్రిట్జ్ మధ్య మూడున్నర గంటల సేపు హోరాహోరీ పోరు సాగింది. ఇందులో 6-4, 7-6, 4-6, 6-7, 3-6 తేడాతో జ్వెరెవ్‌ను మట్టి కరిపించాడు ఫ్రిట్జ్.

Advertisement

తొలి రెండు సెట్లను గెలుచుకున్న జ్వెరెవ్, మూడోది సునాయాశమేనని అందరూ భావించారు. అమెరికా ఆటగాడు ఫ్రిట్జ్ ఔట్ అని మ్యాచ్ చూసిన ఆటగాళ్లు భావించారు. మూడో సెట్ నుంచి మ్యాచ్ టర్న్ అయ్యింది.. ఫ్రిట్జ్ క్వార్టర్స్‌కు చేరుకోగా, జ్వెరెవ్ ఇంటిదారి పట్టాడు. ఫ్రిట్జ్‌.. 12వ ర్యాంక్ ఆటగాడు కాగా,  జ్వెరెవ్ నాలుగో నెంబర్ ఆటగాడు.

ALSO READ: ఐసీసీ ఛైర్మన్‌ రేసులో జై షా.. బీసీసీఐలో మార్పులు ఖాయమా?

Advertisement

జ్వెరెవ్ ప్రధాన బలం బలమైన సర్వీసులు చేయడం. ఆయన వీక్‌నెస్ ర్యాలీలో పెద్దగా ఆడలేకపోవడం. 33 అనవసర తప్పిదాలకు పాల్పడి ఓటమిని కొని తెచ్చుకున్నాడు. ప్రత్యర్థి జ్వెరెవ్ వీక్‌నెస్‌‌ని రెండు సెట్లలో గమనించిన ఫ్రిట్జ్.. మూడో సెట్స్ నుంచి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. మూడు, నాలుగు, ఐదు సెట్లను వరుసగా గెలుచుకుని క్వార్టర్స్‌కి చేరుకున్నాడు.

 

 

 

 

 

Tags

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×