E-Paper
Advertisement

Kangana Ranaut: నేను డేటింగ్‌లో ఉన్నా.. కానీ: కంగన

Kangana Ranaut: నేను డేటింగ్‌లో ఉన్నా.. కానీ: కంగన
Advertisement
Kangana Ranaut latest update

Kangana Ranaut latest update(Bollywood celebrity news):

బాలీవుడ్ హీరోయిన్ కంగన రనౌత్ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తన సినిమాలు, వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఎప్పటి కప్పుడు విమర్శలకు గురవుతుంటారు. తాజాగా మరోసారి వార్తల్లోకెక్కారు. ఇటీవల ఆమె ఓ వ్యక్తితో కలిసి ముంబై వీధుల్లో తిరిగారు. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే వాటిపై స్పందించిన కంగనా.. అతడు తన హెయిర్ స్టైలిష్ట్ అని సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు.

ఇక ఈ వార్తలు మర్చిపోకముందే అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవంలో కంగన సందడి చేశారు. అయితే అక్కడ కంగన, ఈజ్‌ మై ట్రిప్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్‌తో కలిసి ఫోటోలు దిగారు. అందుకు సంబంధించిన ఫొటోలు బయటకొచ్చి వైరల్ అవడంతో.. వీరిద్ధరూ రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జోరుగా మొదలైంది.

Advertisement

ఈ నేపథ్యంలో దీనిపై కంగనా స్పందించారు. తాను, నిషాంత్ పిట్టితో రిలేషన్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు. అవన్నీ వదంతులు మాత్రమేనని అన్నారు. ‘‘దయచేసి అసత్య ప్రచారాలు చేయకండి.. ఇదే నా విన్నపం. నిషాంత్‌కి పెళ్లైంది. ఆయన లైఫ్ హ్యాపీగా ఉంది. నేను వేరే వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నాను. సరైన సమయం వస్తే నేనే చెప్తాను. ఆ సమయం కోసం ఎదురుచూడండి. మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఇద్దరు వ్యక్తులు కలిసి ఫొటోలు దిగినంత మాత్రాన ఇలాంటి రూమర్స్ పుట్టించడం సరైన పద్ధతి కాదు’’ అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ వార్తలకు చెక్ పెట్టినట్లయింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×