BigTV English

Kangana Ranaut – Sandeep Reddy Vanga: తిట్టిన హీరోయిన్‌కు సినిమా ఆఫర్ ఇస్తానన్న ‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. కానీ!

Kangana Ranaut – Sandeep Reddy Vanga: తిట్టిన హీరోయిన్‌కు సినిమా ఆఫర్ ఇస్తానన్న ‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. కానీ!

Kangana Ranaut – Sandeep Reddy Vanga: రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘యానిమల్’. గతేడాది థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేసింది. తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌ నేపథ్యంలో ఫుల్ యాక్షన్ అండ్ లవ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి ప్రేక్షకాభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించగా.. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించి మెప్పించారు. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణన్ కుమార్, మురద్ ఖేతని ఈ చిత్రాన్ని నిర్మించారు.


హిందీ, తెలుగు, తమిళం, మలయాం, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. దాదాపు రూ.900 కోట్లు వసూళ్లను రాబట్టి అదరగొట్టేసింది. ఇటీవల ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ సినిమాపై కొంతమంది విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే దర్శకుడు సందీప్ కూడా ఆ విమర్శలను తిప్పికొడుతూ వస్తున్నాడు.

ఇప్పటికే ఎంతో మంది నటీనటులు ఈ మూవీపై విమర్శలు చేయగా.. ఇటీవల ఈ మూవీపై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ‘‘నా సినిమాలకు పెయిడ్ నెగెటివిటీని అందించడమే పెద్ద విషయం అని అనుకుంటుంటే.. ఆడవారిని కొట్టి, హింసించి, వారిని సెక్స్ వస్తువులులాగా భావించి.. వారితో షూ నాకమని అడిగే చిత్రాలను ఆడియెన్స్ ఎంకరేజ్ చేయడం మరో గొప్ప విషయం’’ అని కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ బాగా వైరల్ కూడా అయ్యాయి.


అయితే తన సినిమాపై నెగెటివ్ కామెంట్స్ చేసిన కంగనా రనౌత్‌ ఒప్పుకుంటే ఆమెకు స్టోరీ చెబుతానని యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తాజాగా చాలా పాజిటివ్‌గా స్పందించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ మాట్లాడుతూ.. ‘‘కంగనాతో కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నారా?’’ అని సందీప్ రెడ్డిని యాంకర్ ప్రశ్నించగా.. ‘‘నాకు అవకాశం వస్తే.. ఆమె ఆ పాత్రకు సరిపోతుందని నాకు అనిపిస్తే.. నేను వెళ్లి ఆమెకు కథ చెబుతాను. ఆమె నటన అంటే నాకు చాలా ఇష్టం. కంగనా నటించిన క్వీన్ సినిమాతో పాటు ఆమె చేసిన చాలా సినిమాలు చూశాను. యాక్టింగ్ బాగుంటుంది.

యానిమల్‌పై ఆమె చేసిన నెగెటివ్ కామెంట్స్‌ గురించి నేను అంతగా పట్టించుకోను. నాకు బాధగా కూడా అనిపించదు’’ అని సందీప్ రెడ్డి వంగా ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అనంతరం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో సందీప్ వంగా వ్యాఖ్యలపై కంగనా రనౌత్ తాజాగా స్పందించింది.

రివ్యూలు, విమర్శలు ఒకటి కాదని.. అవి ఒకేలా ఉండవని తెలిపింది. ప్రతి కళపై సమీక్ష, చర్చ అనేది జరుగుతుందని.. ఇది ఒక సాధారణ విషయమేనని పేర్కొంది. తన రివ్యూపై సందీప్ గారు నవ్వుతూ గౌరవాన్ని చూపించిన విధానం చాలా గొప్పదని తెలిపింది. అది అతను మ్యాన్లీగా సినిమాలు తీయడమే కాదు.. అతని యాటిట్యూడ్ కూడా మ్యాన్లీగానే ఉండటాన్ని చూపిస్తోందని పేర్కొంది.

కానీ, దయచేసి తనకు ఎలాంటి పాత్రను ఇవ్వవద్దని తెలిపింది. అలా అయితే మీ ఆల్ఫా మగ హీరోలు స్త్రీవాదులు అవుతారని పేర్కొంది. ఆపై సినిమాలు కూడా విజయం సాధించవని పేర్కొంది. మీరు బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తారని.. మీలాంటి వాళ్లు సినిమా పరిశ్రమకు కావాలని ఓవైపు సందీప్ రెడ్డిని ప్రశంసిస్తూనే మరోవైపు ఇన్ డైరెక్ట్‌గా చమత్కరించింది. అయితే ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగాపై కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×