BigTV English

Kanguva Day 1 Collections : 1000 కోట్లకు ఎంత తక్కువ ఉందంటే…? మీరు అస్సలు ఊహించరు

Kanguva Day 1 Collections : 1000 కోట్లకు ఎంత తక్కువ ఉందంటే…? మీరు అస్సలు ఊహించరు

Kanguva Day 1 Collections : కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya) కెరీర్‌లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన చిత్రం ‘కంగువా’ (Kanguva). పలు వాయిదాల అనంతరం, ఎన్నో అడ్డంకులను దాటుకుని థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, మొదటి షోతోనే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా రిలీజ్ అయ్యాక ఇదేనా 1000, 2000 కోట్ల సినిమా అంటూ దారుణంగా ట్రోలింగ్ ను ఎదుర్కొంది ‘కంగువా’. మరి ఈ మూవీ ఇంత నెగెటివిటీ మధ్య మొదటి రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం.


స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా భారీ బడ్జెట్ తో నిర్మించిన మూవీ ‘కంగువా’ (Kanguva). ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించారు, సూర్య, బాబీ డియోల్, దిశా పటానీ లీడ్ రోల్స్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ‘కంగువా’ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నిన్న అంటే నవంబర్ 14న విడుదలైంది. ఈ మూవీని 300 -350 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందడంతో సూర్య కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన చిత్రంగా ‘కంగువ’ నిలిచింది. సూర్య నటించిన చివరి చిత్రం ‘ఎధిరుమ్ వటిందావన్’. దీని తర్వాత దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ‘కంగువా’ సినిమా భారీ స్థాయిలో విడుదలైంది.

అయితే సినిమా స్పెషల్ షోలకు అనుమతి లభించకపోవడంతో పాటు, తమిళనాడులోని థియేటర్లలో టికెట్ బుకింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఇక ఇటు నైజాంలో కూడా థియేటర్ల సమస్య ఎదురైంది. అయినప్పటికీ దేశవ్యాప్తంగా థియేటర్లలో 30-40% ఆక్యుపెన్సీ రేటును నమోదు చేసింది. అన్నీ ఇబ్బందులు దాటుకుని థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను దారుణంగా నిరాశపరిచింది. పెద్ద తలనొప్పి సినిమా అంటూ దారుణంగా ట్రోలింగ్ జరిగింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటిరోజు ఇండియాలో 22 కోట్లు వసూలు చేసింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.


దీంతో సూర్య కెరీర్‌లో తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘కంగువా’ (Kanguva) రికార్డును సృష్టించింది. సూర్య చివరి చిత్రం ‘ఎధిరుమ్ వటిందావన్’ భారతదేశంలో మొదటి రోజు రూ.11 కోట్లు వసూలు చేసింది. ‘కంగువా’ అంతకు రెట్టింపు వసూళ్లు రాబట్టింది. కానీ 300 కోట్ల సినిమా కేవలం 20 కోట్లు రాబట్టడం అన్నది నిర్మాతలను ఆందోళనకు గురి చేసే విషయం. తరువాత అయినా పుంజుకుంటుందిలే అని సరిపెట్టుకునే అవకాశం కూడా లేకుండా, సినిమాకు కంప్లీట్ గా నెగెటివ్ టాక్ నడుస్తోంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే నిర్మాతలు నిండా మునిగినట్టే.

అయితే ‘కంగువ’ (Kanguva) తొలిరోజు రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘అమరన్’ ఓపెనింగ్ కలెక్షన్లను బ్రేక్ చేసింది. ‘అమరన్’ మొదటి రోజు 21.4 కోట్లు వసూలు చేసింది. ‘కంగువా’ అంతకన్నా కాస్త ఎక్కువ వసూళ్లు రాబట్టింది. అలాగే ఈ ఏడాది విడుదలైన తమిళ సినిమాలలో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో చిత్రంగా ‘కంగువా’ నిలిచింది. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ – రూ 39.15 కోట్లు, వేట్టయన్ – రూ 27.75 కోట్లు సాధించి మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు సినిమాల రికార్డులను బ్రేక్ చేయడంలో ‘కంగువ’ ఫెయిల్ అయ్యింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×