BigTV English

Kanguva : బాలీవుడ్‌‌పై డామినేషన్ కంటిన్యూ… సూర్య పకడ్బందీ ప్లాన్..!

Kanguva : బాలీవుడ్‌‌పై డామినేషన్ కంటిన్యూ… సూర్య పకడ్బందీ ప్లాన్..!

Kanguva.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya)అటు తమిళ్లోనే కాదు ఇటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నారు. దాదాపు ఆయన తమిళ్లో నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ అవుతూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. గజిని సినిమా నుంచి తెలుగులో మొదలైన సూర్య క్రేజ్ ఇప్పుడు డబుల్ అయింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా సూర్య నటించిన చాలా సినిమాలు తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఒకే టైంలో విడుదలవుతూ అటు తమిళ్ ఇటు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పరిచాయి. ఇక ఇప్పుడు కంగువ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.


కంగువ నటీనటులు..

ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసాయి. ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సిరుత్తై శివ దర్శకత్వం వహిస్తూ ఉండగా.. జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇందులో దిశా పటానీ , బాబీ డియోల్ , కోవై సరళ , యోగిబాబు , నటరాజన్ సుబ్రహ్మణ్యం, కేఎస్ రవికుమార్ , జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


భారీ డామినేషన్.. నార్త్ కోసమే రూ.22 కోట్ల ఖర్చు..

ఈ చిత్రాన్ని 10 కి పైగా భాషల్లో 3D టెక్నాలజీతో తెరకెక్కిస్తుండగా.. ఇందులో మొత్తం 13 డిఫరెంట్ లుక్స్ లో సూర్య కనిపించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఎప్పుడో విడుదల చేయాలనుకున్న ఈ సినిమాకి చిన్న గాయం అవ్వడంతో అనుకున్న సమయానికి విడుదల కాలేక పోయింది. ఇకపోతే ఈ సినిమా కోసం సూర్య స్వయంగా ఎనిమిది భాషల్లో తన గాత్రాన్ని అందించగా.. ఇతర భాషల్లో ఏ ఐ టెక్నాలజీని ఉపయోగించినట్లు సమాచారం. ఇకపోతే నార్త్ లో కూడా సూర్య పగడ్బందీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 3,500 కు పైగా థియేటర్లలో ఒక్క నార్త్ ఇండియాలోనే కంగువ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు సమాచారం. నార్త్ లో ప్రమోషన్స్ కోసం రూ .15 కోట్లు ఖర్చు చేస్తుండగా.. 3,500 స్క్రీన్ లలో థియేట్రికల్ విడుదలకు మరో రూ.7 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే ఒక నార్త్ ఇండియా రిలీజ్ కోసమే రూ.22 కోట్లు ఖర్చు పెట్టారట నిర్మాత జ్ఞానవేల్ రాజా. మొత్తానికైతే బాలీవుడ్ లో సౌత్ డామినేషన్ కనిపిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. మన సౌత్ సినిమాలు ఎలాగైనా నార్త్లో భారీ కలెక్షన్స్ కొట్టాలనే టార్గెట్ తో అంతకుమించి బడ్జెట్ కేటాయిస్తూ ప్రమోషన్ చేపడుతూ నార్త్ ఆడియన్స్ లో పాపులారిటీ సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా ఒక నార్త్ కోసమే రూ .22 కోట్లు ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదు.

నార్త్ లో జెండా పాతనున్న సూర్య..

ఇక కంగువ చిత్రంతో ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లో కూడా జెండా పాతడానికి సిద్ధమయ్యారు సూర్య. సూర్య ఇప్పటికే నార్త్ లో కూడా మంచి పేరు సొంతం చేసుకున్న సూర్య, ఇప్పుడు ఈ సినిమాతో మరింత విజయం అందుకోబోతున్నారు. ఏది ఏమైనా డిఫరెంట్ లుక్ లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న సూర్య ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటారో చూడాలని అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×