E-Paper
Advertisement

Chiranjeevi- Shiva Rajkumar: మెగాస్టార్‌ను కలిసిన శివన్న.. ఈ ఫొటోను ఎవరూ ఊహించి ఉండరు..

Chiranjeevi- Shiva Rajkumar: మెగాస్టార్‌ను కలిసిన శివన్న.. ఈ ఫొటోను ఎవరూ ఊహించి ఉండరు..
Advertisement

Chiranjeevi- Shiva Rajkumar: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘పద్మ’ అవార్డులను ప్రటించిన సంగతి తెలిసందే. దేశంలో వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు పలు పురస్కారాలు ప్రకటించింది. ఇందులో భాగంగా సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది.

దీంతో చాలామంది ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన్ను కలిసి ప్రత్యేక అభినందనలు చెప్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా కన్నడ సినీ నటుడు శివ రాజ్‌కుమార్ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చిరుకి పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన తరుణంలో కంగ్రాట్స్ తెలిపేందుకు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. ఈ మేరకు పుష్పగుచ్చం అందించి.. శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

అనంతరం వారిద్దరూ కలిసి భోజనం చేస్తూ పలు విషయాలపై చర్చించుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలను మెగాస్టార్ తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘‘డియర్ శివరాజ్ కుమార్.. నన్ను అభినందించేందుకు మీరు బెంగళూరు నుంచి ఇక్కడకి రావడం నా హృదయాన్ని హత్తుకుంది’’ అంటూ అందులో రాసుకొచ్చారు.

అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారడంతో అంతా హ్యాపీగా ఫీలౌతున్నారు. కానీ వాటిలో కనిపించే ఓ ఫొటో ఫ్రేమ్ మాత్రం మెగా అభిమానులను మంత్రముగ్దులను చేసింది. అదేంటంటే..?

Advertisement

మెగాస్టార్‌కు శివరాజ్ కుమార్ పుష్పగుచ్చం ఇస్తున్న సమయంలో ఆ వెనుకనే ఉన్న ఫొటో ఫ్రేమ్ అందరికీ తెగ నచ్చేసింది. అందులో చిరు ఇప్పటి వరకు అందుకున్న ‘నంది’ సహా మరికొన్ని అవార్డులు ఉన్నాయి. ముఖ్యంగా తనయుడు, హీరో రామ్ చరణ్‌తో కలిసి దిగిన ఫొటో ఫ్రేమ్ ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటోంది. దీన్ని చూసిన అభిమానులు ‘ఫొటో అదిరింది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×